Thursday, May 2, 2024

వాడీవేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తప్పక చదవండి
  • గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
  • కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలన అంటూ కెటిఆర్‌ విమర్శలు
  • ఘాటుగా తిప్పికొట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి
  • కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదంటూ కౌంటర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనపై కెటిఆర్‌ ప్రస్తావించగా డిప్యూటి సిఎం భట్టి, పొన్నం ప్రభాకర్‌లు అడ్డుకున్నారు. తెలంగృాణ ఏర్పడ్డ పదేళ్ల గురించి ఇక్కడ చర్చ చేయాలన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లేచి కెటిఆర్‌ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. గవర్నర్‌ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే.. కాంగ్రెస్‌ ఎప్పటికీ విపక్షమే అన్న కేటీఆర్‌ కామెంట్స్‌పై రేవంత్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సెటైర్‌ విసిరారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే సరికాదన్నారు. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్‌ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్‌ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లదుడామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌కు యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్‌ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్‌ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతుకుందు ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పులతడకగా ఉందన్నారు. సభ్యుడిగా దీనికి తాను సిగ్గుపడుతున్నా నన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే… అలాగే తెలంగాణ పక్షమేనన్నారు.. కాంగ్రెస్‌ ఎప్పటికీ విపక్షమేనన్నారు. కేటీఆర్‌ ప్రసంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ పాలన పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలని కేటీఆర్‌ సభలో చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్‌ పేరుపై మట్టి పూసినట్టుగా చరిత్రను చెరిపేయలేమన్నారు. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయన్నారు. తెలంగాణకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కేసీఆర్‌ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన కొడుకు కేసీఆర్‌ అంటూ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ చెప్పినట్టు మార్పు మొదలైంది నిర్బందం పోయిందన్నారని వారి అన్నట్టుగానే 2014 జూన్‌ రెండు నాడే నిర్బంధం పోయిందని గుర్తు చేశారు. శ్రీ శ్రీ చెప్పినట్టు బానిసకొక బానిసకొక బానిస అన్నట్టు తెలంగాణను పీడిరచిన వాళ్లు పోయినా వారిని తలుచుకునే వాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము 39 మంది, వాళ్లు 65 మంది ఉన్నారని మిడిసి పడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. వాళ్లకు తమకు మధ్య తేడా 1.85 ఓటు మాత్రమే అన్నారు. దీనికే ఈ మాత్రం మిడిసిపాటు వద్దని చెప్పారు. కేటీఆర్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కొంంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం అవగాహన కాదు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుందని… 51 శాతానికి 100 శాతం వాల్యూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని… 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం చేసే నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు చేపడతారు. అవసరమైతే అమరణ దీక్షలు చేస్తారు. ఆ స్పిరిట్‌ను తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు… మేము 39 మంది ఉన్నాం మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు వచ్చిన కొట్లాడతామంటే ఇక్కడ కుదరదు అన్నారు. ఇలాంటి భాష వాళ్లు గౌరవానికి సభను నడిపించడానికి బాగోదన్నారు. గత పాలనలో యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. సింగిల్‌ విండో డైరెక్టర్‌గా కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇస్తే ఓడిపోయింది కేసీఆర్‌. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్‌ పార్టీ, షిప్పింగ్‌ మినిస్టీ ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌కు కార్మిక శాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన హరీష్‌ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిందని కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కొట్లాడిరది పీజేఆర్‌ మాత్రమే అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పీ జనార్దన్‌ రెడ్డి పోరాడారు. ఇక్కడ ఉన్న వాళ్లు ఎవరూ మాట్లాడలేదన్నారు. కేసీఆర్‌ గురువు చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకొని కేటీఆర్‌ గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఎత్తిపొడిచారు. చీమలు పెట్టినపుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేస్తే అక్కడకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఇక్కడకు వచ్చి టికెట్‌ తీసుకొని కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యారు. మహేందర్‌ రెడ్డికి అన్యాయం చేశారని అన్నారు. గతం గురించి చర్చింలానే ఆలోచన ఉంటే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకొని 2014 జూన్‌ 2 కంటే ముందు అంశాలపై సమగ్రంగా చర్చిద్దామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నామని దానికే కట్టుబడాలని సూచించారు. గవర్నర్‌ ప్రసంగంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ఉందని అంటున్నారు. మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాత ఇచ్చిన స్క్రిప్టునే చదువుతారని అందరికీ తెలిసిందే. గతంలో పాలనలో కీలక పాత్ర పోషించిన వారు కూడా ఇలా విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 9 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసంపై చర్చిద్దామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలంటే చర్చలో పాల్గొనాలని సూచించారు. అంతేకానీ పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు అన్నారు. ఎప్పుటి నుంచో ఈ శాపనార్థాలు చూస్తున్నామన్నారు. పాలక పక్షంగా విజన్‌ డాక్యుమెంట్‌ను సభలో పెట్టామని… దానిపై సలహాలు సూచనలు ఇవ్వాలని హితవుపలికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు