Tuesday, April 30, 2024

రోహిత్‌ శర్మకు భారీ షాక్‌..

తప్పక చదవండి
  • ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా
  • జీరోగా మొదలై.. హీరోగా నిలిపి..
  • ముంబై ఇండియన్స్‌లో ముగిసిన హిట్‌మ్యాన్‌ శకం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంత మైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌.. ఆ జట్టుకు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాకి చ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ ` 2024 సీజన్‌లో ఆ జట్టు కొత్త సారథిని ప్రకటించింది. రెండేండ్ల క్రితమే ఆ జట్టు తప్పించి ఇటీవల మళ్లీ ఐపీఎల్‌ ట్రేడ్‌ ఆప్షన్‌ ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి వచ్చిన ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. దీంతో గత పదేండ్లుగా రోహిత్‌ నాయ కత్వంలో ఉన్న ముంబైకి కొత్త సారథి వచ్చినట్టైంది. కెప్టెన్సీ మా ర్పుతో ముంబై ఇండియన్స్‌లో హిట్‌మ్యాన్‌ శకం ముగిసినట్టైంది.
రోహిత్‌ యుగం.. 2013 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రికీ పాంటింగ్‌ వైదొలగడంతో రోహిత్‌ శర్మ ఆ సీజన్‌ మధ్యలో సారథ్య పగ్గాలు అందుకున్నాడు. సచిన్‌, జయసూర్య, షాన్‌ పొలాక్‌, రికీ పాంటింగ్‌ వంటి దిగ్గజాలు ఉన్న ముంబై ఇండియన్స్‌ సాధించలేని ట్రోఫీని ఆ జట్టుకు హిట్‌మ్యాన్‌ అందించాడు. సారథిగా బాధ్యత లు చేపట్టిన తొలి సీజన్‌లోనే ముంబై.. తొలి ఐపీఎల్‌ ట్రోఫీని దక్కి ంచుకుంది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలో అతడి నేతృత్వంలోనే ముంబై ఐపీఎల్‌ ట్రోఫీలను గెలుచుకుంది.
పాండ్యా రీఎంట్రీ.. ఇక 2015వ సీజన్‌లో ముంబై జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అదే ఏడాది భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పాండ్యా.. ఎంఐ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. కీరన్‌ పొలార్డ్‌తో కలిసి అతడు ముంబైకి అపూర్వ విజయాలను అందించాడు. అయితే 2021లో ముంబై.. పాండ్యాను వేలంలో వదిలేసింది. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ అతడిని సారథిగా నియమించుకుంది. తొలి సీజన్‌లోనే అతడు గుజరాత్‌కు టైటిల్‌ను అందించాడు. రెండో సీజన్‌లో ఫైనల్‌ చేర్చాడు. కానీ గుజరాత్‌ టైటాన్స్‌ యాజమన్యంతో విభేదాల కారణంగా అతడు తిరిగి ముంబైకి తిరిగొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ రిటెన్షన్‌ ప్రక్రియలో ముంబై.. అతడిని గుజరాత్‌ నుంచి ‘బదిలీ’ చేసుకుంది. పాండ్యా రీఎంట్రీతోనే అతడిని ముంబై భావి సారథిగా అనుకున్నా 2025 సీజన్‌లో ఆ ప్రక్రియ మొదలుకావొచ్చని అందరూ భావించారు. కానీ ముంబై మాత్రం వచ్చే సీజన్‌లోనే రోహిత్‌ను సారథిగా తప్పించి పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది.
ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్లు.. బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతాలు చేయగల మెరుగైన ఆటగాళ్లు.. ప్రతిభకు కొదవలేదు.. పెట్టుబడికి రంధి లేదు.. అభిమానగణానికి అంతే లేదు.. కానీ ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గడానికి ముంబై ఇండియన్స్‌ పడరాని పాట్లు పడిరది. సచిన్‌ టెండూల్కర్‌, సనత్‌ జయసూర్య, రికీ పాంటింగ్‌, రాబిన్‌ ఊతప్ప, ఆండ్రూ సైమండ్స్‌, వంటి బ్యాటర్లు.. లసిత్‌ మలింగ, షాన్‌ పొలాక్‌ వంటి బౌలర్లు ఉన్నా సచిన్‌, హార్భజన్‌, పాంటింగ్‌.. ఇలా సారథులు మారుతున్నా ఆ జట్టు ఐదేండ్ల పాటు ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కండ్లు కాయలు కాసేలా చూసింది. 2008 నుంచి 2013 దాకా ఐదేండ్ల కాలంలో ముంబై ఫైనల్‌ చేరింది 2010 సీజన్‌లో మాత్రమే..
‘ఇక ముంబైకి ఐపీఎల్‌ ట్రోఫీ కలేనేమో..?’అని అభిమానులు భావిస్తున్న తరుణంలో ముంబైకి ‘ట్రంప్‌ కార్డు’లా దొరికాడు రోహిత్‌ శర్మ. తెలుగు మూలాలున్న ఈ నాగ్‌పూర్‌ క్రికెటర్‌.. ముంబై కీర్తిని ఐపీఎల్‌లో ఇతర జట్లు అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు. అతడి హయాంలో ముంబై ఏకంగా ఐదు ట్రోఫీలను నెగ్గి ఈ లీగ్‌లోనే మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా నిలిచింది.
2011లో ఎంట్రీ.. 2011లో జరిగిన వేలంలో ముంబైతో చేరిన రోహిత్‌.. 2013లో రికీ పాంటింగ్‌ నుంచి సారథ్య పగ్గాలు అందు కున్నాడు. సీజన్‌ మధ్యలోనే పాంటింగ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవ డంతో ఆ బాధ్యతలు అందుకున్న రోహిత్‌.. తొలి ప్రయత్నంలోనే తానెంటో నిరూపించుకున్నాడు. ఐదేండ్లపాటు ముంబైకి కలగా మిగిలిన ఐపీఎల్‌ ట్రోఫీని.. షర్ట్‌ బటన్‌ వేసుకున్నంత ఈజీగా ముంబైకి అందించాడు. ఆ తర్వాత సీజన్‌లో కూడా ముంబైని ప్లేఆఫ్స్‌కు చేర్చిన రోహిత్‌ .. 2015, 2017లలోనూ ట్రోఫీలు అందించాడు. ఇక 2019, 2020లలో వరుసగా రెండు ట్రోఫీలను అందుకున్నాడు. గత సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్‌ చేరింది. మొత్తంగా రోహిత్‌ సారథ్యంలో ముంబై.. 158 మ్యాచ్‌లు ఆడి 87 మ్యాచ్‌లలో విజయాలు సాధించగా 67 ఓడిరది. నాలుగు మ్యాచ్‌లు టై అయ్యాయి.
ముంబై తలరాతను మార్చి.. రోహిత్‌ సారథ్యంలో ముంబై తలరాత మారింది. గతంలో టాప్‌ ప్లేయర్లతో ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమైన ముంబై.. ఆ తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. పలు మ్యాచ్‌లలో విఫలమైనా వారిపై నమ్మకముంచింది. జట్టులో ఆటగాడిగానే గాక సారథిగా కూడా రోహిత్‌.. ఆటగాళ్లతో కలిసిపోయాడు. హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌, మహేళ జయవర్దెనేలతో సమన్వయం చేసుకుంటూ జట్టును విజ యవంతంగా నడిపించాడు. రోహిత్‌ హయాంలోనే ముంబై ఇండి యన్స్‌ నుంచి హార్ధిక్‌ పాండ్యా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాన్‌ కిషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత క్రికెట్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి జాతీయ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారారు. గత రెండేండ్లుగా తిలక్‌ వర్మ, హృతిక్‌ షోకీన్‌, నెహల్‌ వధేరా, ఆకాశ్‌ మధ్వాల్‌ వంటి యువ ఆటగాళ్లను భవిష్యత్‌ స్టార్లుగా తీర్చిదిద్దడంలో రోహిత్‌ పాత్ర మరువలేనిది.
వచ్చే సీజన్‌ చివరిదా..? ముంబై ఇండియన్స్‌ తాజాగా రోహిత్‌ను సారథ్య పగ్గాల నుంచి తప్పించి హార్ధిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పజెప్పింది. పదేండ్ల పాటు ముంబైని నడిపించిన రోహిత్‌ను ఇలా తొలగించడం అతడి అభిమానులు జీర్ణించుకోలేనిదే అయినా భవిష్యత్‌ దృష్ట్యా ముంబై యాజమాన్యం పాండ్యాకు పగ్గాలు అప్ప జెప్పింది. వయసు, ఫిట్నెస్‌ కారణాల రీత్యా రోహిత్‌.. రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న విషయం జగద్విదితమే. ఈ నేపథ్యంలో రోహిత్‌ 2024 సీజన్‌లో సారథ్య ఒత్తిడిని వదిలేసి పూర్తిస్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్‌ తర్వాత రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యనేది ముంబై ఇండియన్స్‌ తో పాటు హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ చెప్పు కుంటున్న చేదు నిజం! ఏదేమైనా రోహిత్‌ను సారథిగా తప్పిం చడంతో ముంబై ఇండియన్స్‌లో స్వర్ణ యుగం ముగిసినట్టేనని అతడి అభిమానులు వాపోతున్నారు. పదేండ్లుగా ముంబై అంటే రోహిత్‌.. రోహిత్‌ అంటే ముంబైగా సాగిన ప్రస్థానం నేటితో ముగిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు