Wednesday, May 1, 2024

ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

తప్పక చదవండి
  • ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు
  • నల్సాప్ట్‌ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం

హైదరాబాద్‌ : ప్రయాణీ కులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు గాను టీఎస్‌ఆర్‌టీసీ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ ప్రాజెక్ట్‌ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా ముందడుగు వేసింది. డిజిటలైజేషన్‌ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ సొల్యుషన్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాప్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి.. టీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనర్‌ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా వీసీ సజ్జనార్‌
మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్‌టీసీ సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు పది నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టుని అమల్లోకి తెచ్చాం. సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు సీఐఎస్‌ ప్రాజెక్ట్‌ దోహదపడుతోంది. అలాగే.. కేంద్రీకృత సమగ్ర డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది. అంతేకాదు.. ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్‌లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్‌ వంటి కార్యకలాపాల నిర్వహణలో.. రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయం లోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్‌ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేశామని చెప్పుకొచ్చారు. నల్సాప్ట్‌ సీఈఓ నల్లూరి వెంకట్‌ మాట్లాడుతూ.. మెరుగైన సేవల్ని అందించేందుకు టీఎస్‌ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి.. నిర్దేశించిన కాలానికే పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునిక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్‌ఆర్టీసీ ముందంజలో ఉందన్న ఆయన.. ఈ ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా.. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు కలిసిన టీఎస్‌ఆర్టీసీ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్‌ కలిగి ఉన్న సంస్థ.. తాజా నిర్ణయంతో అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు