Wednesday, May 1, 2024

సీఎం గా రేవంతు

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి
  • సీఎల్‌పీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్‌
  • 7న సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం
  • ప్రకటించిన కేసీ వేణుగోపాల్‌
  • సీఎం పదవిపై వరుస భేటీలు.. చర్చలు
  • కేసీ వేణుగోపాల్‌లో ఉత్తమ్‌, భట్టిల చర్చ
  • ఖర్గే, వేణుగోపాల్‌లతో డీకే శివకుమార్‌ భేటీ
  • హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీ కి రేవంత్‌ రెడ్డి

అధిష్ఠానానికి రేవంత్‌ ధన్యవాదాలు అనుమల రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యూత్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న బలమైన రాజకీయ నేత..ఆయన మాటలు యువకులను ప్రేరేపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు.. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే.. విమర్శలు.. నిరసనలు ఇలా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తానయనడంలో సందేహమే లేదు. ఆయన రాజకీయ జీవితం 20 ఏళ్లు కూడా లేకపోయినా.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడమే కాదు.. లేదు.. రాదు.. అన్న పార్టీని అధికారంలోకి తెచ్చి తన మార్కును పదిలపరుచుకున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తన స్థానం ఏంటో అధికారం తెచ్చి మరీ చూపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీని అగ్రభాగాన నిలపటంలో రేవంత్‌ పాత్ర ఎంతో కీలకం. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్‌గా ఉంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరు సాగించారు. సీఎం కేసీఆర్‌ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ.. చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధం కాగా.. రేవంత్‌ సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..


న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. సిఎల్‌పి నేతగా రేవంత్‌ పేరును కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌ ప్రకటించారు. 7వ తేదీన రేవంత్‌ సిఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. సిఎల్‌పి నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నామని, అధిష్టానానికి అందిన నివేదకల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సిఎల్‌పీ తీర్మానం మేరకు నిర్ణయించామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్‌ బాగా పనిచేశారని, కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడ్డారని అన్నారు. రేవంత్‌ ఓ డైనమిక్‌ లీడర్‌ అంటూ వేణుగోపాల్‌ తెలిపారు. ఢల్లీిలో మీడియా సమావేశంలో మాణఙగం ఠాక్రే, డికె శివకుమార్‌ పాల్గొన్నారు. మంతరివర్గ కూర్పు తదితర విషయాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లా నుంచి ఢల్లీికి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి సీఎం పదవీపై స్పష్టమైన హామీ రావడంతోనే రేవంత్‌ ఢల్లీి బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢల్లీి వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారం కైవసం చేసుకుంది. రేవంత్‌ ఢల్లీి వెళ్లడంతో మంత్రివర్గ ఊహగానాలకు తెరపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సిఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్‌ కరసత్తు చేసింది. ఖర్గే నివాసంలో చర్చలు జరిగాయి. కెసి వేణుగోపాలు చర్చించారు. దీనిపై ఓనిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి పదవికి పలువురు కీలక నేతలు పోటీపడ్డారు. సోమవారమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఢల్లీి వేదికగా మంగళవారం ఉదయం నుంచి వరుస భేటీలు సాగుతున్నాయి. మల్లికార్జున ఖర్గేతో రాహుల్‌ భేటీ అయ్యారు. తరవాత డికె శివకుమార్‌ కూడా భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కొందరు ఢల్లీికి చేరుకున్నారు. ఈ క్రమంలో సిఎం ఎవరన్నది ప్రకటించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా హైదరాబాద్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డికి ఢల్లీి నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢల్లీికి బయలుదేరారు. సిఎం పదవికి రేవంత్‌ పేరునే నేతలంతా ఖరారు చేశారని, మంత్రివర్గ కూర్పుపై తుదినిర్ణయం తీసుకునేందుకే రేవంత్‌ను ఢల్లీికి రావాలని ఆదేశించారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కీలక సమావేశం జరిగిం ఈ భేటీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం అభ్యర్థిపై చర్చించిట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమేనని భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు తెలిపారు. తన అభిప్రాయం కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చెప్పానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్‌ అన్ని ఆలోచనలు చేస్తుందని, నలుగురు.. ఐదుగురు రేసులో ఉండటం తప్పుకాదని ఉత్తమ్‌ అన్నారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని ఉత్తమ్‌ తెలిపారు. తాజాగా ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో సైతం ముమ్మర ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో పార్టీ పరిశీలకుల సమావేశంలో సోమవారం సీఎల్పీ మీటింగ్‌ జరిగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగించారు. సీఎం పదవి, కేబినెట్‌ బెర్తుల విషయంలో పంచాయితీ నేపథ్యంలో వాయిదాపడిరది. ముఖ్య నేతలు పట్టువీడకపోవడంతో డీకే శివకుమార్‌తో పాటు పరిశీలకులను అధిష్ఠానం ఢల్లీికి పిలిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం ఢల్లీిలో మకాం వేశారు. ఎవరికి వారు తమ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం కూడా పలువురు నేతలు ఢల్లీిలో అప్పుడే లాబీయింగ్‌ మొదలు పెట్టారు. తాజాగా మరో నేత సైతం ఢల్లీిలో ప్రత్యక్షమ య్యారు. బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీ వినోద్‌ ఢల్లీిలో మకాం వేసారు. మంగళవారం కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే, వినోద్‌ సోదరుడు సైతం వివేక్‌ చెన్నూరు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం అన్నాదమ్ముళ్లు ఇద్దరు మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికి మాత్రమే పదవి ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వినోద్‌ ఢల్లీిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. తాను గతంలో మంత్రిగా పని చేశానని.. తనకు మరోసారి కేబినెట్‌లో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు వివేక్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండి మంతనాలు చేస్తున్నారు. సీఎం రేసులో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో చేరేందుకు వివేక్‌ సమ్మతించారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ముళ్లు ఇద్దరు కేబినెట్‌ బెర్తు కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. సోనియా సమావేశం అనంతరం మీడియాతో వినోద్‌ మాట్లాడుతూ.. తాను 2004`2009 వరకు మంత్రిగా పని చేశానన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరోసారి కేబినెట్‌లో చోటు చేసుకోసం రెక్వెస్ట్‌ కోసం ఢల్లీికి వచ్చానని.. ఈ మేరకు సోనియాకు విజ్ఞాపనపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవి ఖాయమనే సంకేతాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంపికపై సీనియర్లు చర్చలు జరుపుతున్నారన్నారు. ఇవాళ లేదంటే రేపు సీఎంను ప్రకటించే అవకాశం ఉందన్నారు. 7వ తేదీన.. లేదంటే 9న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంటుందన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌ చర్చలు జరుపుతున్నారన్నారు. ఎమ్మెల్యేల అందరికీ అభిప్రాయాలను తీసుకొని హైకమాండ్‌కు పంపారన్నారు. హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను వెంకటస్వామి కొడుకునని.. హైకమాండే లా అన్నారు. ఏ ఆదేశాలు ఇచ్చినా స్వీకరిస్తామని.. నాకున్న అనుభవంతో మంత్రిత్వ శాఖ ఇచ్చినా మేనేజ్‌ చేయగలుగుతానన్నారు. ఐదేళ్లపాటు ఎలాంటి రిమార్క్‌ లేకుండా వైఎస్‌ కేబినెట్‌లో పని చేశానని.. తనకు మంచి అవగాహన ఉందన్నారు. తన సేవలను ఏలాగైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్‌ ఎల్లాకు వచ్చారు. కాగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం తిరుగు పయనమైన పరిశీలకుడు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం. నగరం చేరుకున్నాక సీనియర్లతో చర్చ అనంతరం సీఎం పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎంగా రేవంత్‌ రెడ్డి పేరుని నిర్ణయించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రేవంత్‌ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డీకే శివకుమార్‌ ఎమ్మెల్యేలతో చెప్పిన తర్వాత ప్రకటన చేయనున్నారని సమాచారం. కాగా సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ భేటీ తర్వాత పరిశీలకుల బృందం ఢల్లీి వెళ్లి అధిష్ఠానంతో చర్చించింది. ఆ వెంటనే భట్టి విక్రమార్క్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఢల్లీి వెళ్లి అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపాయి. అయితే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఢల్లీికి రావాలని పిలుపు రావడంతో హుటాహుటిన రేవంత్‌ బయలుదేరి వెళ్లారు.
అనుమల రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యూత్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న బలమైన రాజకీయ నేత..ఆయన మాటలు యువకులను ప్రేరేపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు.. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే.. విమర్శలు.. నిరసనలు ఇలా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తానయనడంలో సందేహమే లేదు. ఆయన రాజకీయ జీవితం 20 ఏళ్లు కూడా లేకపోయినా.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడమే కాదు.. లేదు.. రాదు.. అన్న పార్టీని అధికారంలోకి తెచ్చి తన మార్కును పదిలపరుచుకున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తన స్థానం ఏంటో అధికారం తెచ్చి మరీ చూపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీని అగ్రభాగాన నిలపటంలో రేవంత్‌ పాత్ర ఎంతో కీలకం. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్‌గా ఉంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరు సాగించారు. సీఎం కేసీఆర్‌ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ.. చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధం కాగా.. రేవంత్‌ సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు