Sunday, April 28, 2024

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

తప్పక చదవండి
  • రోడ్డుప్రమాదంలో ఒకరుమృతి
  • ప్రమాదస్థలికి బయలుదేరిన బంధువుల మృతి

నల్లగొండ : పొగమంచు ప్రాణాలు తీస్తోంది. వాహనాలు డ్రైవింగ్‌ చేయాడానికే వణికిపోతున్నారు డ్రైవర్లు. పొగమంచు కారణంగా నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతన్ని చూసేందుకు వస్తున్న బంధువులు కూడా ప్రమాదం బారిన పడ్డారు. పెద్దపూర మండలం మల్లెవాని కుంట తండాకు చెందిన వారంత ఆటోలో వేంపాడు వస్తున్నారు. వాళ్లు వస్తున్న ఆట పార్వతీపురం వద్ద ప్రమాదానికి గురైంది. ఆటోను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఆటోను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో నలుగురు చనిపోయారు. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఇంకో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. గుణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జి చనిపోయిన వారిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలోనే గంటల వ్యవధిలోనే ఐదుగురు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మక్తల్‌ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నారాయణపేట జిల్లా మఖ్తల్‌ పీఎస్‌ పరిధిలోని జ్లకెయిర్‌ వద్ద వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్‌టేక్‌ చేసింది. ఈ ప్రయత్నంలో ఆ కారు ఎదురుగా వస్తున్న వెహికల్‌ను ఢీ కొట్టింది. వికారాబాద్‌ జిల్లాలో పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగింది. శివారెడ్డిపేట్‌ చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్‌ వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనోల ఒక్కరు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. క్రేన్‌ సాయంతో కారును అధికారులు బయటకు తీశారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైకర్‌ కేశవులుతోపాటు పాదచారి సైదులు మృతిచెందారు. కేశవులు మరణవార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పెద్దవూర మండలం మల్లెవాని కుంట తండా నుంచి ఆటోలో ప్రమాద స్థలికి బయల్దేరారు. ఈ క్రమంలో పార్వతీపురం వద్ద వారి ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులను గుణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో మ్లలెవానికుంటలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భార్రతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు