Monday, April 29, 2024

మంత్రివర్గంలోకి సీతక్క, సురేఖ

తప్పక చదవండి
  • ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్‌ నేతలు

వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్‌కు సన్నిహితురాలిగా సీతక్కకు మంత్రి పదవి కలిసి వచ్చే అవకాశం ఉంది. బీసీ మహిళగా, మాజీ మంత్రిగా కొండా సురేఖకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మినహా సీనియర్లు లేకపోవడం కూడా సురేఖ, సీతక్కకు కలిసివచ్చే అంశాలు. దీంతో పక్కాగా వీరిద్దరి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే గెలిచిన వారంతా కొత్తవారే కావడంతో వీరికి అవకాశం ఉందని ఇక్కడి కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు