Tuesday, April 30, 2024

టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

తప్పక చదవండి

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చాలా నెలల అనంతరం టీ20 జట్టులోకి వచ్చిన ఈ ఇద్దరు ఎలా ఆడతారో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌లో రోహిత్‌ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌లో రోహిత్‌ శర్మ మరో 44 పరుగులు చేస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత్‌ కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ పేరిట ఉంది. విరాట్‌ 50 మ్యాచ్‌ల్లో 1570 పరుగులు చేయగా.. రోహిత్‌ 51 మ్యాచ్‌ల్లో 1552 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఎంఎస్‌ ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో 1112 పరుగులు చేశాడు. మూడు టీ20లు కాబట్టి ఈ సిరీస్‌లో రోహిత్‌ ఈ రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌ మీదున్న విషయం తెలిసిందే.మరోవైపు అత్యధిక టీ20 విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్‌ శర్మ మరో మూడు విజయాల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన రోహిత్‌.. 39 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకు న్నాడు. ఈ జాబితాలో ఎంఎస్‌ ధోనీ (భారత్‌), అస్గర్‌ (అఫ్గానిస్థాన్‌), బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌), ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లాండ్‌), బ్రెయిన్‌ మసబా (ఉగాండ) 42 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు