Monday, April 29, 2024

బాబర్‌ అజామ్‌ను అధిగమించిన విరాట్‌ కోహ్లీ

తప్పక చదవండి

సీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్‌-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్‌-10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ 775 రేటింగ్‌ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. తొలి టెస్టులో 38, 76 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో టెస్టులో 46, 12 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విఫలమైన పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబార్‌ అజామ్‌ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో పర్వాలేదనిపించిన రోహిత్‌ శర్మ 748 రేటింగ్‌ పాయింట్లతో 14 నుంచి పదో స్థానానికి చేరాడు. రోహిత్‌ రెండు టెస్టుల్లో 5, 0, 39, 17 నాటౌట్‌ రన్స్‌ చేశాడు. కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌ టాప్‌-3లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో ఇరగదీసిన టీమిండియా పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా (4), మొహ్మద్‌ సిరాజ్‌ (17) ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. రవీంద్ర జడేజా ఓ స్థానం? కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌తో సిరీస్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ (117) రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (121) అగ్రస్థానంలో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు