Monday, April 29, 2024

సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి : ఎమ్మెల్సీ కవిత

తప్పక చదవండి

నిజామాబాద్‌ : వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్‌ గుప్తా తరఫున నాగారంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాక ముందు ఈ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈ కాలనీని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కొత్త మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. కేసీఆర్‌ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు. కాంగ్రెస్‌ పాలనలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేది. ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగలేదన్నారు. రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో 3200 ఉద్యోగాలు కల్పించాం. రానున్న ప్రభుత్వంలో విద్య, వైద్యం మరింత మెరుగు పరుస్తాం. కొత్త బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తామని కవిత హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు