Friday, July 26, 2024

మామిడి హరికృష్ణ మాయలుకళాకారుల ఆవేదనలు..

తప్పక చదవండి
  • తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖశాఖకు అంబాసిడర్ గా ప్రచారం
  • పదేళ్లుగా బదిలీ లేదు.. కళాకారుల పెద్దన్నగా చాలామణి
  • రవీంద్ర భారతి వేదికగా దందా.. సినివారం పేరిట సొంత ఇమేజ్
  • అనుచరులకు లక్షలల్లో బిల్లులు.. ప్రభుత్వ సొమ్ము వృధా..
  • తెలంగాణ కళాకారులకు మొండి చేయి.. ఆంధ్ర వారికి ప్రోగ్రామ్స్
  • గత ప్రభుత్వ పెద్దల అండదండలు.. అనేక అవినీతి ఆరోపణలు
  • వెంటనే అధికారిపై విచారణ చేపట్టాలని కళాకారుల డిమాండు

ఇతడు ఒక ప్రభుత్వ ఉద్యోగి… తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఎందరికో సుపరిచితం. మాటలతో మభ్యపెట్టడం, కాకా పట్టడం, రాజకీయ నాయకులను పొగడ్తలతో ముంచడం వెన్నతో పెట్టిన విద్య. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి బదిలీ లేకుండా పెత్తనం చలాయిస్తున్నాడు. తన మాయ మాటలతో అధికారులను ప్రసన్నం చేసుకుంటూ అర్హతలు లేకున్నా శాఖకు డైరెక్టర్ గా మామిడి హరికృష్ణ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేళ్ల అధికార వ్యామోహన్ని పదవి కాలాన్ని తిరగేస్తే నివ్వరపోయే నిజాలు తెలుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ గత ప్రభుత్వ అధికార పార్టీ బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించాడు. అప్పటి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ తన పబ్బం గడుపుకున్నాడు.. ముఖ్యమంత్రి మనిషిగా ముద్ర వేసుకొని సహచర ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని చాలామంది వాపోతున్నారు. కళాకారుల కాణాచిగా పేరుగాంచిన రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారులకు మొండి చేయి చూపిస్తూ, ఆంధ్ర వారికి అప్పనంగా ప్రోగ్రామ్స్ ను అప్పజెప్పాడని కళాకారులు చెబుతున్నారు. నచ్చితే పొగడ్తలతో అందలం ఎక్కిస్తాడు. నచ్చకపోతే పాతాళానికి తొక్కేస్తాడని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర భారతి వేదికగా కళాకారుల పెద్దన్నగా పేరు సంపాదించుకొని, బినామీలను పెట్టుకుని, తన అనుచరులకు లక్షల్లో బిల్లులు మంజూరు చేయించాడనేమాట బలంగా వినిపిస్తుంది. తనకు తెలియకుంటే ఎవరైనా ప్రోగ్రాం చేస్తే ఆఫీసు చుట్టూ నెలల తరబడి తిప్పుకునే అలవాటు ఉందంటున్నారు. మరి ముఖ్యంగా సాంస్కృతిక సారధి కళాకారుల ఎంపికలో వివక్షకు ఆధ్యుడని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కళల పేరిట కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము
కాజేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఎవరు ఈ హరికృష్ణ..?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం రాకముందు మామిడి హరికృష్ణ ఒక రిజిస్టార్ ఆఫీసు లో చిరుద్యోగి. అనతి కాలంలోనే గ్రూప్ వన్ క్యాడర్ కు సమానమైన హోదాను తన చాకచక్యంతో చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతము తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులుగా కొనసాగుతున్నాడు. కొంతమంది ప్రముఖ పెద్ద నాయకుల చొరవతో సీనియార్టీ లేకున్నా లాబింగు చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నాడు. రవీంద్ర భారతికి సంబంధం లేని సినిమాలు సినీవారం పేరుతో ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు పదవిని అడ్డుపెట్టుకొని అనేకమంది సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వ సొమ్ముతో ముద్రించిన పుస్తకాలను నచ్చిన వారికి పంచి పెడతాడని తెలుస్తుంది. ప్రభుత్వపరంగా తెలంగాణ వ్యాప్తంగా కల్చరల్ ప్రోగ్రాం జరగాలంటే అక్కడ హరికృష్ణ మనుషులు తప్పకుండా ఉండి తీరాల్సిందే.

మాటల పుట్ట.. ఫైరవుల దిట్ట

ఈ వ్యక్తి విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయడు. ఇంట్లో కంటే ఎక్కువగా ఉద్యోగానికి సమయాన్ని కేటాయిస్తాడు. పని ఉన్నా లేకున్నా గంటల తరబడి ఆఫీసులోనే ఉంటాడు. పెద్ద పెద్ద వారితో పరిచయాలు పెంచుకుంటాడు. గొప్ప పనిమంతుడుగా ప్రశంసలు పొందుతాడు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగని మరిచిపోయి రోజు అనేక వేదికలపై అధికార పార్టీని ఆకాశానికి ఎత్తుతాడు. నాయకులను పొగడ్తలతో ముంచుతాడు. మైకు దొరికితే చాలు వదిలిపెట్టడు. కవి, రచయిత కాబట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తాడు. కాకా పట్టడం, కాళ్లు మొక్కడం, మాటలతో మభ్యపెట్టడం, నటనలో జీవించడం, ఎదుటివారిని ఇట్లే ఆకర్షించడం, పెద్ద సారుకు (ముఖ్యమంత్రికి) దగ్గర అని చెప్పుకోవడం, కులానికి సంబంధించిన అధికారులను కూడగట్టడం, వారికి పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఇవ్వడం, పరిచయాలు పెంచుకోవడం, అతనికి వెన్నతో పెట్టిన విద్య అని చాలామంది అనుకుంటున్నారు. పదేళ్లుగా ఒకే చోట ఉంటూ పదవిని అనుభవిస్తూ రాచమర్యాదలను పొందుతున్నాడనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి చాలామంది హరికృష్ణ పై కంప్లీట్ చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది.

ఇప్పటికైనా కొత్త ప్రభుత్వంలో ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుకుంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ఈ వ్యక్తి వెనకాల ఉన్న పెద్దలు ఎవరో కనిపెట్టి, అవినీతి అక్రమాలను బట్టబయలు చేయాలని తెలంగాణ కళాకారులు డిమాండ్ చేస్తున్నారు.

నేను తప్పు చేయలేదు: హరికృష్ణ

నా మీద వస్తున్న ఆరోపణలు ఆవాస్తవం. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణ సంస్కృతి వైభవానికి కృషి చేశాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు