Sunday, June 23, 2024

ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు

తప్పక చదవండి
  • సర్వేయర్ వెంకటేష్ ని కాపాడుతుంది ఎవరు
  • కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులుకూడా బేఖాతరు
  • అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు
  • బిల్డర్ పై క్రిమినల్ కేసులు బుక్ అయిన చర్యలు శూన్యం
  • ఒక సర్వే నెంబర్ లో అనుమతులు పొంది
  • మరో సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపడుతున్న ఘనులు
  • దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయండి

హైదరాబాద్ :హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉప్పల్ మండలం లో ఏం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ గ్రామంలో 581/1 సర్వే నెంబర్లు మొత్తము భూమి విస్తీర్ణం 217 ఎకరాల 34 గుంటలు కాగా ఇందులోనుండి 208 ఎకరాల33 గుంటల భూమిని 1963 లో ప్రభుత్వం అటవీ శాఖ కోసం తీసుకున్నారు ప్రభుత్వము పట్టేదారులకు పరిహారం కూడా చెల్లించింది అప్పటి ప్రభుత్వం కోసం తీసుకున్నది తీసుకున్న అప్పటి ప్రభుత్వం పట్టేదారులకు పరిహారం కూడా చెల్లించింది. కాగా అందులో మిగిలింది తొమ్మిది ఎకరాల ఒక్క గుంట మిగులు భూమి ఉన్నది దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన 22 మంది చట్ట విరుద్ధంగా పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా దీని పక్కనే ఉన్న 584 సర్వే నెంబర్ లో తనకు 31 గుంటల భూమి ఉందని దాంట్లో భవన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోరుతూ జిహెచ్ఎంసికి రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. జిహెచ్ఎంసి వారు 584 సర్వే నెంబర్ కు అనుమతులు జారీ చేశారు. అనంతరం అతను హ్యాబిటెక్ ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ అనే నిర్మాణ సంస్థకు బిల్డింగ్ డెవలప్మెంట్ కు అగ్రిమెంట్ కుదిరించుకొని ఇచ్చాడు. సదరు కంపెనీ రోహిత్ రెడ్డి చూయించిన భూమిలో నిర్మాణం చేపట్టారు. అయితే ఇది తెలుసుకున్న భూ యజమాని షమీర్ బెగ్. అనే వ్యక్తి పుట్టింగ్ల దశలోనే ఆపేందుకు ప్రయత్నించగా బిల్డర్ వెంకటేష్ రెడ్డి , రాజేశ్వరరావు రోహిత్ రెడ్డిలు నిర్మాణాలను ఆపకుండా భూ యజమాని పై దౌర్జన్యానికి దిగడంతో ఆయన అధికారులను ఆశ్రయించి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో ఫిర్యాదు చేశాడు నా సొంత భూమిలో చట్టవిరుద్దంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని దానిని ఆపాలంటూ అటు జిహెచ్ఎంసి అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో వారు పట్టించుకోకపోగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ రెవెన్యూ అధికారులకు షామీర్ బెగ్ ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని తెలిపారు. అయితే తహసిల్దార్ సూచనల మేరకు అప్పటి సర్వేయర్ ప్రశాంత్ కుమార్ సర్వే చేసి నిర్మాణం చేపడుతున్న భూమి 581/1 సర్వే నెంబర్లో ఉందని తెలిపారు. దీనిపై రోహిత్ రెడ్డి మూడు నెలల తర్వాత మీరు ఇచ్చిన సర్వే రిపోర్టు తప్పు అని నేను మళ్ళీ సర్వే చేయించుకుంటానని అన్నారు. మొదట సర్వే రిపోర్ట్ ఇచ్చిన ప్రశాంత్ కుమార్ వేరే మండలానికి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో వచ్చిన సర్వేర్ వెంకటేష్ బిల్డర్ల పక్షాన తప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. దీంతో బాధితుడు మరోసారి సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ ఫిర్యాదు చేయగా కమిషనర్ఎ డి సర్వే కు ఆదేశించారు.ఎడి సర్వే గతం లొ ప్రశాంత్ కుమార్ సర్వేర్ ఇచ్చిన రిపోర్టే వచ్చింది. రెవెన్యూ అధికారులు కార్యాలయంలో ఉన్న అన్ని రిపోర్టర్లు కూడా బాధితుడి కి అనుకూలంగానే వచ్చాయని తేల్చినప్పటికిని జిహెచ్ఎంసి అధికారులు మాత్రం అక్రమ బిల్డర్ లపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని బాధితుడు వాపోతున్నాడు. ముఖ్యంగా తప్పుడు సర్వే రిపోర్టు ఇచ్చినఎం .వెంకటేష్ రిపోర్టు కే వత్తాసు పలుకుతూ జిహెచ్ఎం సి అధికారులు బాధితుని గోడును పట్టించుకోకపోవడం తో ఆవేదన చెందుతున్నాడు. ముఖ్యంగా ఇందులో జిహెచ్ఎంసి అధికారులు ఆమ్యమ్యాల మత్తులో జోగుతూ బాధితుడికి అన్యాయం చేస్తున్నారు. వీరందరూ అక్రమ బిల్డర్లకు సపోర్ట్ చేయడంలో ఎన్ని కోట్ల ఆమ్యామ్యా లు చేతులు మారాయినని అనుమానం కలుగుతుంది.

ఒక మండల సర్వేర్ కు జిహెచ్ఎంసి అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది

- Advertisement -

ముఖ్యంగా ఒక మండల సర్వేయర్ కు జిహెచ్ఎంసి అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది . సర్వేర్ వెంకటేష్ పై బాధితుడు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిచ్చిన సర్వే రిపోర్ట్ ను పరిశీలించగా తప్పుడు రిపోర్ట్ అని తేలింది! అంతకుముందుసర్వేయర్ ప్రశాంత్ కుమార్మరియు ఏ డి ఇచ్చిన సర్వే రిపోర్టు సరైనదని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీంతో కలెక్టర్ సర్వేర్ వెంకటేష్ కి నోటీసులు జారీ చేశారు అతనిపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని సూచించారు.

కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు బేఖాతరు
సర్వే నెంబర్లు చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ నోటీసులు పంపినప్పటికిని బిల్డర్లు పట్టించుకోకుండా తమ పని తాము కొనసాగిస్తున్నారు బునాది దశలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేయగా నేడు 9 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. అంటే అధికారులు ఎలా పని చేస్తున్నారు. అర్థమవుతుంది కొంతమంది అధికారులుఅమ్యమాలకు అలవాటు పడి బాధితుడికి అన్యాయం చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అడర్ నెంబర్ ఈ/1/1063/2023 తేది 17/05/2023నాడు ఇచ్చాడు. జిహెచ్ఎంసి కమిషనర్ షోకాజ్ నోటీస్ లెటర్ నెంబర్ ఏ /9926/టిపిఎస్/ జిహెచ్ఎంసి హెచ్ ఓ/ 2022/818- తేదీ 22/ 06/2023 ప్రకారం జారీచేసిన వారు నిర్మాణాన్ని మాత్రం ఆపడం లేదు. క్రిమినల్ కేసులుబుక్ అయిన కూడా డోంట్ కేర్ అంటూ అటుకొంతమంది అధికారులు ఇటు బిల్డర్లు కుమ్మక్కై యధావిధిగా తమ పనులను తాము చేసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నాడు.

అమ్యమాలు ఇస్తే అక్రమాన్ని సక్రమం చేస్తారా

తెలంగాణ రాష్ట్రంలో భూబకాసురులు పేట్రేగిపోతున్నారు డబ్బులుంటే ఏమైనా చేయొచ్చని బరితెగిస్తున్నారు. సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. గత ప్రభుత్వంలోనూ ఎంతోమంది భూ బకాసురుల చేతుల్లో బలైనారు. అధికారులను మచ్చిక చేసుకుని అమ్యాన్యాలు ఇచ్చి అక్రమాలను సక్రమం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాల పైన పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సర్వేయర్ వెంకటేష్ లాంటి అవినీతి అధికారులను వదిలిపెట్టొద్దని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు