Sunday, May 12, 2024

మూడు రోజుల పాటు ప్రధాని తెలంగాణ పర్యటన

తప్పక చదవండి
  • 25, 26, 27 తేదీల్లో పర్యటన ఖరారు
  • షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రేమేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వారి షెడ్యూల్‌ను ప్రకటించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధాని మోదీతో సహా పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో ఉదృతంగా పర్యటిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నట్టు వెల్లడిరచారు. నేడు నిర్మల సీతారామన్‌ జూబ్లీహిల్స్‌లో.. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముషీరాబాద్‌లో పర్యటిస్తారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఈ నెల 24, 26, 28వ తేదీలలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక 23, 25, 26, 27వ తేదీలలో నాలుగు రోజుల పాటు జేపీ నడ్డా పర్యటన ఉంటుందని చెప్పారు. 23న నడ్డ ముదొల్‌, సంగారెడ్డి , నిజామాబాద్‌ అర్బన్‌తో పాటు హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహిస్తారని, 24, 25, 26వ తేదీలలో యోగి అదిత్యనాథ్‌ 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని, 24, 26వ తేదీలలో రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండు రోజుల పాటు 6 సభల్లో పాల్గొంటారని వెల్లడిరచారు. హిమంత బిస్వ శర్మ ఈ నెల 22 నుంచి 27 వరకు అనేక బహిరంగ సభల్లో పాల్గొననున్నారని తెలిపారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ 22న వరంగల్‌ బహిరంగ సభ, 26న అమిత్‌ షాతో కలిసి జనసేనా అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్‌ సభలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు