Monday, April 29, 2024

కొత్త ప్రభుత్వం – ఎన్నో సవాళ్ళు..!

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు గడిచిన కాలం, గత పదేళ్లుగా తెరాసా ప్రభుత్వం అధికారంలో కొనసాగింది, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, తెరాసా ప్రభుత్వం కు చేక్‌ పెట్టిన ప్రజలు, మరల కొత్త ప్రభుత్వంకు అవకాశం ఇచ్చారు, నూతన నాయకత్వంలో అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు, అయితే ఇందులో తెలంగాణలో కొత్త ప్రభుత్వంకి చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది. ఆరు గ్యారెంటీలు.. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్స్‌ పార్టీ కి ఆరు గ్యారెంటీ లు బాగా కలిసి వచింట్టుంది, ఎక్కువ మంది ప్రజలు ఉచితాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, అసలు ఊచితాలు ఇవ్వటమే పెద్ద సమస్య అని తెలంగాణ ప్రజలు గ్రహించాలి, కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలం టే చాలా పడ్బందీగా డబ్బులు ఖర్చులు పెట్టాలి, దుబారా తగ్గిం చాలి, ముఖ్యంగా రైతు బంధు వంటి పథకం వల్ల పెద్ద మొత్తం లో డబ్బు అంతా ఖర్చు అవుతుంది, సన్న చిన్న కారు రైతులు కేవలం పది శాతం ఉంటే మిగత తొంబై శాతం వరకు భూస్వా ములు రాజకీయ నాయకుల దగ్గర భూమి కేంద్రీకృతమై ఉంది, మరీ ఈపథకం ముమ్మాటికీ భూస్వాములకు మాత్రమె ఉపయో గం, కేవలం ఐదు ఎకరాల లోపు కట్‌ చేసి రైతు బందు అమలు చేయాలి, అదే విధంగా అరు గ్యారెంటీల విషయంలో కూడా ఉచితంగా ఇచ్చేవి చాలా ఉన్నాయి, అందులో పేదవారికి గుర్తించి, వాళ్లకు మాత్రమే అందితే బాగుంటుంది. కౌలు దారు విషయంలో రైతుకు డబ్బులు ఇవ్వడం ఏవిధంగా ఇస్తారో తెలి యదు, మన దేశంలో కౌలు దారుల చట్టం అసలు అమలే కాదు, మరీ వాళ్ళని ఏ విధంగా అడుకుంటారో తెలియదు. ఆరు గ్యారెం టీలా మీద మళ్లీ ఒకసారి పున పరిశీలన చేయడం ఎంతైనా అవసరం ఉంది.
పెండిరగ్‌లో ఉన్న సమస్యలు: రాష్ట్రం లో చాలా పెండిరగ్‌ పనులు ఉన్నాయి, అయితే అందులో భాగంగా గత పదేళ్లుగా రేషన్‌ కార్డుల జారీ లేదు, దాని వల్ల,చాలా కుటుంబాలు బాధలు పడ్డా రు, వివిధ రకాల పనులకు రేషన్‌ తప్పనిసరిగా ఉంటుంది,దాని గురించీ కూడా ప్రభుత్వం అలోచన చేయాలి, అదేవిధంగా చాలా ఏళ్లుగా దక్షిణ తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పెండిరగ్‌లో నిలచి పోయాయి, అందులో నల్గొండలో ఉన్న ఎస్‌ ఎల్‌ బీసీ ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల వంటి ప్రోజెక్ట్‌ లా పనులు పెండిరగ్‌లో అయన పొక పూర్తిగా నోచుకోక ఎదురు చూస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వం దృష్టి సారించాలి, కొత్త ప్రభుత్వం లో బీసీ కార్పొరేషన్‌ లోన్స్‌ విషయంలో కూడా 2018 నుండి నేటి వరకు బీసీ కార్పొరేషన్‌ లోన్స్‌ ఇవ్వటం లేదు, చాలా సబ్బండ వృత్తులు ఉద్యోగాలు మరియు ఉపాధి లేక ఖాళీగా ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళను ద్రుష్టిలో ఉంచుకో బీసీ కార్పొరేషన్‌ లోన్స్‌ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
ఇల్లు లేని పేద వాళ్లకు ఇళ్లు కట్టుకునే వారికీ ఐదు లక్షల మేర ఆర్ధిక సహాయం అందించడంలో ముందు ఉండాలి. భూ సంబం ధిత ధరణీ సమస్యలు.. అసలు తెలంగాణలో రోజూ అధికారుల చుట్టూ తిరిగే పది మందిలో తొమ్మిది మంది భూ సమస్యల తోటే ఉంటారు, ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లలో చెప్పులు అరిగే దాకా తిరుగుతారు, కానీ సమస్యలు మాత్రం తిరవ్‌, ధరణీ విషయంలో ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి, రూరల్‌ స్థాయి విష య ంలో కాస్తూ కాలం పట్ట కాలం వంటివి డిజిటల్‌ సర్వే చేయించి ఎండ్ల తరబడి ఉన్నసమస్యలకు చెక్‌పెట్టాలి, కోర్ట్‌లలో ఉన్న పెం డిరగ్‌ కేసులు తగ్గు ముఖం పడతాయి, ధరణినీ చాలా సవరణ అవసరం ఉంది, కాబట్టీ ప్రధానసమస్యలలో భూసమస్యలు ఒకటి.
విద్య వైద్యం సౌకర్యాలు పెంచాలి:
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ముందుగా విద్య వైద్యం సౌకర్యాలు లలో ముందు ఉండాలి, ఇప్పటికే గత పదేళ్లుగా తెరాసా ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ విషయము లో చాలా నెలకొల్పింది, వీటిని మరిన్ని జిల్లాలకు పెంచి, వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా నూతన నాయకత్వం చొరవ తీసుకోవాలి, ప్రభుత్వ హాస్పిటల్‌ లలో చాలా సౌకర్యాలు లేవు, స్టాఫ్‌ లు లేక ఇబ్బందుల పట్ల చాలా ప్రభుత్వ హాస్పిటల్‌ లు నడుస్తున్నాయి వాటిని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు తీసుకోవాలి, కరోనా సమయం లో ఆక్సిజన్‌ అత్యవసరం వంటి కొరత కారణంగా ఎంతో మంది ప్రజలు చనిపోయారు, కాబట్టీ అదేవిధంగా ప్రభుత్వ బడుల విష యం లో కూడా పౌష్ఠిక ఆహారం, పెరుగుదల రేటు, ప్రైవేట్‌ పాఠ శాలలు ఏ మాత్రం దిటు ఉండేటట్టు ప్రభుత్వం పాఠశాలలు అధుని కరించలి, ఢల్లీి స్థాయిలో ఉన్న విధానం మన దగ్గర రావాలి, అభివృద్ధి ఆవిధంగా ఉంటే కొత్త ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని కోరుకుందాం. ఇలా అనేక రకాల సమస్యలు చెప్పు కుంటు పోతే చాలానే ఉన్నాయి, ఈ ప్రభుత్వం కొన్ని సమస్యల మీద నైనా దృష్టి సారించాలి, తెలంగాణ రాష్ట్రం నీ దేశంలో నెంబర్‌ వన్‌గా నిలబెట్టాలి అని కోరుకుందాం. జై తెలంగాణ జై హిందు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు