Tuesday, April 30, 2024

చిన్న వ్యాపారులకు మీషో ద్వారా అవకాశాలు విస్తరణ

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మీషో ఈనాడు భారతదేశంలో అసలుసిసలైన ఇ-కామర్స్‌ మార్కెట్‌ వేదిక. లక్షలాది మంది చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలను విస్తరిస్తున్నాది. మీషో అక్టోబర్‌-2023 నుంచి కేవలం రెండు నెలల కాలంలో సుమారు 25,000 మంది నాన్‌-జిఎస్టీ విక్రేతలను చేర్చుకోవటం జరిగినది. ఈ సంవత్సర ఆరంభంలో మీషో అనేక సాంకేతికతలను అందిపుచ్చు కుని అమలుచేయటం వలన, 1 అక్టోబర్‌ 2023 నుండి మీషో వేదిక ద్వారా విక్రయాలకు నాన్‌-జిఎస్టీ విక్రేతలకు మార్గం సుగమం అయ్యినది. జిఎస్టీ కౌన్సిల్‌ వారు రూ.40 లక్షల వరకు టర్నోవర్‌ కలిగిన నాన్‌-జిఎస్టీ వ్యాపారులను ఇ-కామర్స్‌ వేదికలకు అనుమతించిన ప్రకటన వలన ఈ స్పందన రావటం సంభవించినది. ఈ చర్య కారణంగా లక్షలాది మంది కొత్త వ్యాపారులు తలుపులు తెరచి డిజిటల్‌ వ్యాపార రంగంలోనికి అడుగుపెట్టే అవకాశం కలిగినది. గడచిన రెండు నెలలు కాలంలో ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి 20 రాష్ట్రాల మీషో లో కొత్తగా చేరిన విక్రేతలలో 40% నాన్‌-జిఎస్టీ విక్రయదారులు కావటం విశేషం.ఇంతకూ ముందు ఈ రిటైలర్లు మరియు చిన్న తయారీదారులు తమ వ్యాపారాన్ని తమ వెబ్‌ సైట్‌ తోపాటు వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రాం వంటి వాటి ద్వారా నిర్వహించుకునేవారు. జిఎస్టీ కౌన్సిల్‌ ప్రవేశ పెట్టిన నూతన విధానం వలన వీరంతా మీషో వంటి ఇ-కామర్స్‌ వేదికలలో చేరటం జరిగినది. నుతనగా మీశోలో చేరిన ఈ చిరు వ్యాపారులు 1.3 లక్షలకు పైబడిన తమ ఉత్పత్తుల జాబితాను అందిచారు. ఈ ఉత్పత్తులలో 80% మీషోకు కొత్తవి కావటం ప్రత్యేకత. వీటిలో గృహో పకరణాలు, వంటింటి సామాగ్రి, హస్తకళా నైపుణ్యతతో తయారు చేసిన ఆభరణాలు, చీరలు, నార సంచులు వగైరా విభిన్న రకాల ఉత్పత్తులు చోటుచేసుకున్నాయి. ఈ జిఎస్టీ సడలింపు విభిన్నమైన మరియు స్థానిక ఉత్పత్తులను ఖాతాదారులకు సరసమైన ధలకు అందించుటకు సహకరించినది. మేఘా అగర్వాల్‌, సిఎక్స్‌ఓ బిజినెస్‌, మీషో వారు మాట్లాడుతూ సుమారు 25,000 మంది నాన్‌-జిఎస్టీ వ్యాపారులను మా ఇ-కామర్స్‌ వేదికకు స్వాగాతించటం సంతోషంగా ఉంది అన్నారు. చేరిన ప్రతి కొత్త విక్రేత ఒక ప్రత్యేక కథ మరియు కల కలిగి ఉండటం, ఆన్‌ లైన్‌ మార్కెట్‌ వేదికను విభిన్నంగా మరియు సాధికారికంగా నిర్వహించాలనే మా దృష్టిని సాకారం చేస్తున్నాది అన్నారు. 2024 నాటికి 10 మిలియన్ల విక్రయదారులను డిజిటలైజ్‌ చేయాలనే లక్ష్యానికి కట్టుబడి, చిరు వ్యాపారుల కోసం జిఎస్టీ నమోదు తొలగించాలనే ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, మీషో ను నూతన పంథాలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాము అన్నారు. ఈ సందర్భంగా మదురై కి చెందిన వనితా కృష్ణమూర్తి, మీషో విక్రయదారు ‘‘ మధురై కూడలి ప్రాంతంలోని ఒక చిన్న వ్యాపారాన్ని మా కలలను సాకారం చేసుకునే విజయాల దిశగా సాగేందుకు మీషో సహాయ పడిరదని తెలిపారు. కేవలం ఒకే నెలలో మా ప్రత్యేక ఉత్పత్తులను మీషో వేదిక ద్వారా రాష్ట్రంలోని ఖాతాదారులు అందరితో పంచుకోగాలిగాము అన్నారు. మీషో వారి సులభతరమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరియు 0% కమీషన్‌ విధానాలకు ధన్యావాదాలు తెలిపారు. మా చిన్న వ్యాపారులు పెరిగేందుకు ఇది ఎంతో దోహదపడిరది అన్నారు. నాన్‌-జిఎస్టీ విక్రేతల కోసం మీషో సాంకేతిక అప్‌గ్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌, సరళీకృత జాబితాలు అప్‌లోడ్‌, జియో-నిషేధిత ఉత్పత్తుల శోధన మరియు పారదర్శకత కోసం మెరుగైన షిప్పింగ్‌ లేబుళ్ళు ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు