Friday, May 3, 2024

అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..

తప్పక చదవండి
  • పలు కీలక అంశాలపై చర్చ..
  • ఈనెల 10న రాష్ట్రానికి రానున్న అమిత్ షా..
  • గతంలో ఎన్నడో లేని విధంగా పాలమూరు సభ సక్సెస్ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…‘‘ఈనెల 10వ తేదీన అమిత్‌షా తెలంగాణకు వస్తారు. అక్టోబర్ 5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతాయి. జేపీ నడ్డా రాబోయే ఎన్నికల కోసం దిశానిర్ధేశం చేస్తారు. అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటిస్తాం. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డులను ప్రధాని ప్రకటించారు. పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగింది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు