Monday, May 6, 2024

చిల్లర తిప్పలు చెక్..

తప్పక చదవండి
  • నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న టి.ఎస్.ఆర్.టి.సి.
  • యూపీఐ డిజిటల్ ద్వారా టికెట్ జరీ..
  • ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో మొదలైన ప్రక్రియ..

హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో దాదాపు 2,500పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబోతుంది. అయితే ఇప్పటికే..ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే నగరంలోని ఎయిర్‌పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్‌ జారీ చేస్తున్నారు. తాజాగా సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐ-టీమ్స్‌ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు