Monday, April 29, 2024

కీలక వడ్డీరేట్లు యథాతథం

తప్పక చదవండి
  • మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం
  • ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం
  • వివరాలు వెల్లడించిన శక్తికాంత్‌ దాస

ముంబై (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడిరచారు. అయితే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ చెబుతున్నారు. అందుకే కీలక వడ్డీ రేట్లను 6.5 శాతం దగ్గరే ఉంచాలన్న ప్రతిపాదనకు మానిటరీ పాలసీ కమిటీ ఏక గ్రీవంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. స్టాండిరగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్‌ స్టాండిరగ్‌ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టనుంది. ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ ఐదో సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆర్‌బీఐ తన రెపో రేటులోఎలాంటి మార్పు చేయలేదు. 6.50 శాతం వద్దే కొనసాగించింది. రెపో రేటులో మార్పు ఉండదన్న విషయాన్ని మొదటి నుంచి ఊహిస్తున్నదే కాబట్టి, ఈ నిర్ణయం మార్కెట్‌ను ఆశ్చర్యపరచలేదు. అయితే, రెపో రేటును స్థిరంగా ఉంచితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్‌ ఉండదు. కాబట్టి, రుణం తీసుకున్న / తీసుకోబోయే ప్రజల విూద అదనపు ఇఓఎ భారం పడదు. వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఇఓఎల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. రెపో రేటును ప్రకటిస్తూనే, ఈజ24లో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడిరచారు. మొత్తం 202324 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతకు ముందు, ఈ ఏడాది ఆగస్టులో, ఆర్‌బిఐ తన ద్రవ్యోల్బణ రేటు అంచనాను 5.1 శాతం నుంచి 5.40 శాతానికి పెంచింది. తాజా, కూడా అదే అంచనాను కొనసాగించింది. ద్రవ్యోల్బణం అంచనాను మార్చకపోవడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఆహార ధరల్లో జంప్‌ కారణంగానే పాత లెక్కనే ఈసారి కూడా అప్పజెప్పింది కేంద్ర బ్యాంక్‌. ఆహార పదార్థాల ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు, సామాన్యుడిపై ధరాభారం కొనసాగుతుందన్నది దీని అర్ధం. ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చాలా కూల్‌గా చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానాల్లో మార్పుల ప్రభావం మొత్తం ద్రవ్యోల్బణం గణాంకాలపై స్పష్టంగా కనిపిస్తోందని, అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరా గొలుసు వంటి చాలా ఇతర కారణాలు ఉన్నాయని దాస్‌ చెప్పారు. ఆహార పదార్థాల ధరల పెరుగుదల ప్రభావం నవంబర్‌ నెల ద్రవ్యోల్బణంలో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా డిసెంబర్‌ నంబర్‌లోనూ ఆ ప్రభావం గట్టిగానే ఉండవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్‌డిసెంబర్‌ కాలం) ద్రవ్యోల్బణం రేటు 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో (2024 జనవరిమార్చి కాలం) 5.20 శాతంగా సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో, ద్రవ్యోల్బణం మొదటి త్రైమాసికంలో 5.20 శాతం, రెండో త్రైమాసికంలో 4 శాతం, మూడో త్రైమాసికంలో 4.70 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ లెక్కగట్టింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు