Monday, April 29, 2024

10 ఏళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

తప్పక చదవండి
  • కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు
  • కేసీఆర్ ను గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి
  • ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే
  • బీఆర్ఎస్, బీజేపీకి తేడా లేదు… రెండు పార్టీలు ఒక్కటే
  • అంజన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి
  • కార్నర్ మీటింగ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

హైదరాబాద్ : మూడ్రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ హమీలు అమలవ్వలేదని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, బీజేపీ చేస్తున్న ప్రచారం అబద్ధమని ప్రజలు దీనిని తిప్పికొట్టాలన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కు మద్దతు గా సిద్ధరామయ్య బాగ్ లింగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీల వైఖరి ఒక్కటేనని.. పేదలపై పన్నులు వేసి.. బడాబాబులకు రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, రైతులు, యువతకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు సిద్దరామయ్య. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల చేశారని.. తెలంగాణ వచ్చినప్పుడు 75వేల కోట్ల అప్పులుంటే.. పదేళ్లలో 5లక్షల 30 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

కర్ణాటకలో తాము అమలు చేస్తునన గ్యారంటీలపై సీఎం కేసీఆర్, కేటీఆర్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గ్యారంటీలు అమలు అవుతున్నాయి లేదా కర్ణాటకు వచ్చి చూడమని కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ విసురుతున్నా.. కానీ వాళ్లకు కర్ణాటక కు వచ్చే ధైర్యం లేదన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతాయని పేర్కొన్నారు. కర్ణాటకలో తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని ప్రజలు మోసపోవద్దని సూచించారు. గ్యారెంటీ స్కీమ్​ల అమలు కోసం వారు ప్రమాణస్వీకారం చేసిన రోజే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు