Sunday, September 15, 2024
spot_img

బీసీలకు పెద్దపీట వేసిన బీజేపీని గెలిపిద్దాం..

తప్పక చదవండి
  • బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్

హైదరాబాద్ : బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని, బీసీరాజ్యం తెచ్చు కుందామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరీం నగర్ ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు . జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒక బీసీ ప్రధానిగా ఉన్నటువంటి పార్టీ తెలంగాణకు బీసీని సీఎం చేస్తామని ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.బీసీ సీఎం చేస్తారన్న బిజెపికే బీసీలంతా మద్దతుగా నిలవాలని దాసు సురేష్ కోరారు. బీసీల చిరకాల ఆకాంక్ష అయిన బీసీ సీఎం కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నామనీ, మోడీ ఒక బీసీ ప్రధానిగా ఉండడం, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించడం చారిత్రాత్మక శుభపరిణామమన్నారు. బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం బీసీ లంతా బిజెపితో పాటు నిలవాల్సినటువంటి ఆవశ్యకత నేడు ఏర్పడిందని దాసు సురెష్ తెలిపారు. కరీంనగర్లో సమస్యలు గత పది ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని దాసు సురేష్ విమర్శించారు. చేనేతల ఆత్మహత్యలను ప్రభుత్వం నివారించలేక పోయిందని ధ్వజమెత్తారు. కరీంనగర్ను డల్లాస్ సిటీగా చేస్తానన్న కేసీఆర్ హామీ పేద ప్రజల జేబులను ఖల్లాస్ చేసిందని తెలిపారు..కేసీఆర్ హయాంలో కరీంనగర్ లోని సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు..బీసీలు 30వ తారీకు జరగబోయే ఎన్నికలలో బీసీలంతా కమలం గుర్తుకు ఓటేసి బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ వెంట నిలవాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా కార్యనిర్వక అధ్యక్షులు రాచకొండ విఠలేశ్వర్, కార్యదర్శి రజనీకాంత్, సామనపల్లి లక్ష్మి, శంకరాచారి, కారపర్తి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి, కార్యదర్శి మిర్యాల శ్రీలత, రాష్ట్ర కమిటీ సభ్యులు బలరాం, రాష్ట్ర యువజన కన్వీనర్ మడత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు