- ఈ ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని వృదా చేసిన కేసీఆర్ కుటుంబాన్ని,
కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను జైలులో వేయాలి.. - కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ చేసి కేసీఆర్
ఆస్తులను జాతీయం చేయాలి.. - డిమాండ్ చేసిన బిఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేష్ గుణ..
హైదరాబాద్ : బుధవారం రోజున మందమరి పట్టణంలోని జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఈసీ మెంబర్ దేవునూరి సంపత్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని, మేడిగడ్డలోని కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడంమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం అని తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు ఎం.వి. గుణ, ఇంచార్జి జాగిరి రాజేష్ లు మాట్లాడుతూ….. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా విఫలమైందని, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం ద్వారా లక్ష పదకొండు వేల కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోసిన పన్నీరు అయిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం సంపాదించిన ఆస్తులను జాతీయం చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ కుటుంబాన్ని, కాంట్రాక్టర్ లను, ఇంజనీర్లను జైలుకు పంపాలని, కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ చేయాలని, పుట్టిన ప్రతి బిడ్డతో సహా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషి పైన సుమారుగా లక్ష 30 వేల రూపాయల భారం పడుతుంది అంటే కెసిఆర్ యొక్క తుగ్లక్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు కట్టినట్టు అర్థమవుతుందని, మేడిగడ్డ జాతర, సుందిళ్ళ జాతర అని మంచిర్యాల జిల్లా ప్రజలను మోసం చేసిన బాల్క సుమన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని, కేవలం కమిషన్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, జరగబోయే ఎలక్షన్లలో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు తోటే సమాధానం చెప్పాలని, ప్రజలందరూ ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించి ఏనుగుపై చేరుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, రమేష్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..