Friday, May 10, 2024

పసందైన వంటకాలను ఆవిష్కరిస్తున్న ‘‘అంతేరా’’ కిచెన్ అండ్ బార్…

తప్పక చదవండి
  • గచ్చిబౌలిలో 2వ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అంతేరా..
  • అచ్చమైన తెలుగు వంటకాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న అంతేరా

హైదరాబాద్ : విభిన్న రకాల రుచులతో, అసాధారణమైన తెలుగు వంటకాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ అండ్ బార్ మరో నూతన రెస్టారెంట్‌ ప్రారంభంతో తమ సేవలను విస్తరించింది. గచ్చిబౌలి వేదికగా అంతేరా రెండవ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 25, 2023న (బుధవారం) ఏర్పాటు చేయగా., ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నోరూరించే తెలుగు వంటకాల వేడుక వేడుక అద్భుతమైన రుచులతో పాటు సెలబ్రిటీ హంగులతో ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిలో భాగమైన వంటకాలు, తెలుగు రాష్ట్రాల్లో వారసత్వంగా కొనసాగుతున్న అద్భుతమైన – ఆరోగ్యమైన రుచులకు నిదర్శనంగా అంతేరా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వంటకాల సమ్మేళనాన్ని నగరవాసులకు చేరువ చేయడానికి ప్రత్యేకంగా ‘అంతేరా’ రెస్టారెంట్‌ను ప్రారంభించామని భాగస్వాములు ఆశిష్ రెడ్డి, అనురాగ్ రెడ్డి, అనూహ్య రెడ్డి, మృణాల్ పేర్కొన్నారు. విలాసవంతమైన విందులు, స్థానికంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలను ప్రతిబింభించే వాతావరణంతో గచ్చిబౌలిలో ఈ రెస్టారెంట్‌ను ఆవిష్కరించారు.

ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్థ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.., “నేను అంతేరా కుటుంబంలో భాగమైనందుకు, మరో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంతేరా బృందం అతి తక్కువ సమయంలోనే సాధించిన వృద్ధి, ఆదరణ ఎంతో సంతృప్తినిచ్చింది. రానున్న రోజుల్లో వారు మరింతగా అభివృద్ధి చెందుతూ, మరింతగా విస్తరించాలని అంతేరా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫుడ్‌ స్పాట్‌ ఖచ్చితంగా అన్ని రకాల ఆహార ప్రియులను సంతృప్తి పరుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతం నుండి అక్కడ ప్రాచూర్యం పొందిన విభిన్న రకాల రుచులను నగరంలో అందించడం అభినందనీయం’’ అని తెలిపారు.

- Advertisement -

అంతేరా కిచెన్ అండ్ బార్‌ భాగస్వామి ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ., “గచ్చిబౌలికి తెలుగు వంటకాల రుచులను తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు.., మూడు ప్రాంతాల గొప్ప వారసత్వాన్ని కొనసాగించే ప్రయాణం. ఆహార ప్రియులు కోరుకునే వినూత్న రుచులను అందించడానికి మన వారసత్వ వంటకాల్లోని రుచిని-పోషకవిలువలను కాలానుగుణమైన పసందైన వంటకాలుగా వడ్డించి మరచిపోలేని అనుభవాలకు కేంద్రంగా మార్చుతున్నాం’’ అని అన్నారు.

మరో భాగస్వామి అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ., “తెలుగు సంప్రదాయాల ఆత్మను ప్రదర్శించే ఒక అద్భుత వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం. వంటలపై ఖచ్చితమైన శ్రద్ధ, వంటల మూలాలపై లోతైన మక్కువతో పాటుగా ఆధునికమైన భోజన అనుభవాన్ని రూపొందించామ’’ని పేర్కొన్నారు. “గచ్చిబౌలి ఒక ఆదరణీయమైన హబ్, అంతేకాకుండా మా రెస్టారెంట్ వంటలు ఇక్కడి ప్రకృతి పారవశ్యానికి ఒక ప్రత్యేక కోణాన్ని జోడిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. మాతో పాటు తెలుగు వంటకాల ఆవశ్యకతను, అనుభూతిని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని అంతేరా భాగస్వామి అనూహ్య రెడ్డి తెలిపారు.

“గచ్చిబౌలిలో ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవం మా విజయానికి మరో నిదర్శనం. అనాదిగా వస్తున్న వారసత్వం అందించిన గొప్ప రుచులను మా విలువైన అతిథులతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. అంతేకాకుండా నగరంలో మరపురాని అద్భుత భోజన అనుభవాన్ని అందించడానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటామని అంతేరా పార్ట్నర్‌ మృణాల్ వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు