Saturday, May 11, 2024

తెలంగాణ ప్రజా సేన నుండి 20 మంది ఎమ్మెళ్యే అభ్యర్థులు బరిలో..

తప్పక చదవండి
  • తెలంగాణ ప్రజా సేన వ్యవస్థాపకులు బొమ్మ కంటి రమేష్ వర్మ వెల్లడి..

ములుగు : తెలంగాణ ప్రజా సేన నుండి 20 మంది ఎమ్మెళ్యే అభ్యర్థులు ఈ సారి ఎ మ్మెళ్యే స్థానాల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలంగాణ ప్రజాసేన నుండి పోటీ చేయనున్నట్లు, తెలంగాణ ప్రజాసేన వ్యవస్థాపకులు బొమ్మ కంటి రమేష్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాసేన ను స్థాపించినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యల సాధన కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బహుజనులు ఉన్నప్పటికీ రాజ్యాధికారం సాధించలేకపోతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు తమ బలం చూపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజాసేన నుండి ఈ ఎన్నికల్లో ఆయా నియోజక వర్గాల్లో 20 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దింపనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా పది మందిని ఫస్ట్ లిస్టులో ఎంపిక చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి నుండి బొమ్మ కంటి రమేష్ వర్మ, సిరిసిల్ల నుండి జిను క తిరుపతి, పరకాల నుండి వడాల సరస్వతి, వరంగల్ తూర్పు జన్ను భరత్, వరంగల్ పశ్చిమ పిడిశెట్టి రాజు, జనగామ నుండి కొలుగురి శ్రీకాంత్, వర్ధన్నపేట నుండి నక్క రాజు, కరీంనగర్ నుండి రెడ్డి రఘు ముదిరాజ్, అంబర్ పేట నుండి నిషాని శంకరయ్య, మహబూబ్ బాద్ నుండి దరవత్ నాను నాయక్ లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉంటారని తెలిపారు. త్వరలో మిగతా పదిమంది అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు