Saturday, April 27, 2024

మిజోరంలో దూసుకుపోతున్న జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ

తప్పక చదవండి

న్యూఢిల్లీ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7న పోలింగ్‌ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్‌ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్‌ కూడా జరగాల్సి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరంలో ఆదివారం సామూహిక ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి.. కౌంటింగ్‌ తేదీ మార్చాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరాయి. దాంతో మిజోరంలో కౌంటింగ్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కేవలం 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ప్రతిపక్ష జెడ్‌పీఎమ్‌ రెండు స్థానాల్లో గెలుపొంది, 27 స్థానాల్లో అధికారంలో ఉంది. బీజేపీ 3 సీట్లోలనూ, కాంగ్రెస్‌ 1 సీటులోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికారం దిశగా దూసుకుపోతున్న జెడ్‌పీఎమ్‌ అధినేత లాల్‌ దహోమాపై ప్రస్తుతం అందరి కళ్లూ ఉన్నాయి. జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీని నడిపిస్తున్న 74 ఏళ్ల లాల్‌ దహోమా గతంలో ఎఖూ అధికారిగా పని చేశారు. గోవాలో కెరీర్‌ ప్రారంభించిన దహోమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం పార్టీని వీడి భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై డిశ్చార్జ్‌ అయిన మొదటి ఎంపీగా నిలిచారు. అనంతరం 2017లో జోరం నేషనలిస్ట్‌ పార్టీ స్థాపించి ఆ తర్వాత జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018లో ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత ఎన్నికల్లో తన పార్టీని అధికారం దిశగా నడిపిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు