Saturday, April 27, 2024

డ్రైనేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు

తప్పక చదవండి
  • కంకర వాడకంలో ఇష్టారాజ్యం
  • 40ఎంఎంతో బెడ్‌ నిర్మాణం
  • రూ.11లక్షల పనుల్లో పర్యవేక్షణ లోపం
  • కాంట్రాక్టర్‌కు ఏరియా సివిల్‌ అధికారుల వత్తాసు
  • జీఎం గారు.. జర పట్టించుకోరు..

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని నిర్వాసిత ప్రాంతమైన రాంపురంలో ఏరియా సివిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. రాంపురంలో సివిల్‌ కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షిం చాల్సిన ఏరియా సివిల్‌ అధికారులు డ్రైన్‌ నిర్మాణ పనులను పర్యవేక్షిం చకపోవడం వల్ల కాంట్రాక్టర్‌ ఆడిరది ఆట పాడిరది పాటగా సాగుతుంది. 1,2, 6కంకరతోపాటు 40ఎంఎం కంకర సైతం వాడాల్సి ఉంది కానీ డ్రైన్‌ బెడ్‌ నిర్మాణంలో 1, 2, 6కంకరను వాడకుండా కేవలం 40ఎంఎం కంకరతోనే బెడ్ల నిర్మాణం చేస్తుండటం చూస్తుంటే కాంట్రాక్టర్‌కు అధికారులు ఏస్థాయిలో సహకరిస్తున్నారో చెప్పకనే చెప్పవచ్చు. నిర్మాణ పనులను అధికారులు, సూపర్‌వైజర్లు దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ సివిల్‌ అధికారులు నిర్మాణ పనుల వద్ద కానరావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నాడని నాసిరకంగా నిర్మిస్తున్న డ్రైన్లు ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు సర్వత్ర వినిపిస్తున్నాయి. అదే విధంగా డ్రైన్‌ మధ్యలో చెట్ల మొద్దులు ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండానే డ్రైన్‌ను నిర్మిస్తున్నారు. అయినా పట్టించుకునే నా ధుడే లేకుండా పోయాడు. అంతేకాకుండా స్థానికులు నిర్మించుకున్న వాటిని సైతం తొలగించకుండానే డ్రైన్‌ నిర్మిస్తూ ఉండటంతో రానున్న రోజుల్లో డ్రైన్లో నీరు నిలిచిదోమలు వ్యాప్తి చెందడంతోపాటు ఆనీటి దుర్వాసనలతో ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాంపురం ప్రజలు, డ్రైన్‌ నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై సివిల్‌ ఉన్నతాధికారులతోపాటు ఏరియా జనరల్‌ మేనేజర్‌ దృష్టిసారించి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు