Thursday, May 9, 2024

మిర్యాలగూడ డివిజన్‌లో11.31లక్షల నగదు, 35 లీటర్ల లిక్కర్‌ పట్టివేత

తప్పక చదవండి

మిర్యాలగూడ : ఎన్నికల కోడ్‌ అమలవు తున్న నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గురువారం మిర్యాలగూడ డివిజన్‌ వ్యాప్తంగా 11.31లక్షల నగదు,35లీటర్ల మధ్యం స్వాధీనపరచుకున్నట్లు డి.ఎస్‌.పి కె వెంకటగిరి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడిరచారు. మిర్యాలగూడ పట్టణంలోని వన్‌ టౌన్‌ పరిధిలో ఈదులు కూడా చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇలాంటి ఆధారాలు లేని 1.41లక్షల నగదు, టూ టౌన్‌ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద 9 లక్షల నగదు, వాడపల్లి సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో తరలిస్తున్న 90 వేల నగదు, వేములపల్లి ఎన్‌ఎస్పి కాలనీ వద్ద సుమారు 10వేల విలువచేసే 35 లీటర్ల మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుకున్న నగదును నల్గొండ జిల్లా ట్రెజరీ కార్యాలయం కు, మద్యం మిర్యాలగూడ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో వన్‌ టౌన్‌ సిఐ రాఘవేందర్‌, ఎస్సై శ్రీను నాయక్‌, టూ టౌన్‌ సిఐ నరసింహారావు, ఎస్సై కృష్ణయ్య, వాడపల్లి, వేములపల్లి ఎస్సైలు మామిడి రవికుమార్‌, దాచేపల్లి విజయ్‌ కుమార్‌ లు వున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు