Tuesday, May 14, 2024

అమెరికాలో భారతీయ వ్యక్తి జీవిత ఖైదు..

తప్పక చదవండి
  • కత్తితో పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తి

వాషింగ్టన్ : కత్తితో 17 సార్లు పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. ఈ నెల 3న ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయబోనని నిందితుడు చెప్పడంతో మరణ శిక్ష తప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది కార్యాలయం పేర్కొంది. 2020లో ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్ హాస్పిటల్‌లో 26 ఏళ్ల మెరిన్ జాయ్ నర్సుగా పనిచేసింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త ఫిలిప్ మాథ్యూ అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పార్కింగ్‌ వద్ద ఆమె కారును తన కారుతో అడ్డుకున్నాడు. ఆపై కత్తితో 17 సార్లు ఆమెను పొడిచాడు. తీవ్ర గాయాలతో నేలపై పడిన భార్య మీదుగా కారును నడిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన జాయ్‌ను ఆసుపత్రికి తరలించారు. బిడ్డ తల్లినంటూ పలుమార్లు ఏడ్చిన ఆమె, భర్త తనను కత్తితో పొడిచి పారిపోయినట్లు చెప్పింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ నేపథ్యంలో నిందితుడైన ఫిలిప్ మాథ్యూను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు సుమారు మూడేళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపిన ఫ్లోరిడా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఫిలిప్ మాథ్యూకు మరణ శిక్ష పడే అవకాశం ఉన్నందున భార్యను హత్య చేసిన ఆరోపణలపై అపీల్‌ చేయబోనని కోర్టులో అతడు ప్రాథేయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడా కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. అలాగే మారణాయుధంతో దాడి చేసినందుకు అదనంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు