- మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్..
- ఎంతవరకు ఫైనల్ అవుతుందో అన్న సర్వత్రా ఆసక్తి..
హైదరాబాద్ : తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.. కాగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో.. అమావాస్య తరువాత ఈ నెల 15 లేదా 16న 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది.. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఏకాభిప్రాయం కుదరని మిగితా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది.
భాజపా ప్రకటించబోయే 38 మందితో కూడిన తొలి జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.. దీనిపై భాజపా శ్రేణులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చక్కర్లు కొడుతున్న అభ్యర్థుల జాబితా :
అంబర్‌పేట – కిషన్ రెడ్డి, ముషీరాబాద్ – బండారు విజయలక్ష్మి, సనత్‌నగర్ – మర్రి శశిధర్ రెడ్డి, ఉప్పల్ – ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మల్కాజిగిరి – రాంచందర్‌రావు, ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్ – విక్రమ్ గౌడ్, మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్, కల్వకుర్తి – తల్లోజు ఆచారి, గద్వాల – డీకే అరుణ, మహబూబ్‌నగర్ – జితేందర్ రెడ్డి, తాండూరు – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్, కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్, భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి, ఆలేరు – కాసం వెంకటేశ్వర్లు, హుజురాబాద్ – ఈటల రాజేందర్, కరీంనగర్ – బండి సంజయ్, చొప్పదండి – బొడిగే శోభ, వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు, భూపాలపల్లి – చందుపట్ల కీర్తిరెడ్డి, వేములవాడ – చెన్నమనేని వికాస్ రావు, ఆదిలాబాద్ – పాయల్ శంకర్, బోథ్ – సోయం బాపూరావు, ఆర్మూర్ – ధర్మపురి అర్వింద్, మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వర్లు, పరకాల – గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుబ్బాక – రఘునందన్ రావు, వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్, మహబూబాబాద్ – హుస్సేన్ నాయక్, సికింద్రాబాద్ – బండ కార్తీక రెడ్డి, నర్సంపేట – రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ – ఏనుగుల రాకేశ్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ – విజయరామారావు, రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి..