Sunday, May 12, 2024

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం..

తప్పక చదవండి
  • మురళీధరన్ నేతృత్వంలో మీటింగ్..
  • అభ్యర్థుల ఎంపికలో కసరత్తు..
  • అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ..

ఢిల్లీ : తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కాగా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సబంధించి అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఒకే అభ్యర్థి ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేస్తోంది. మొదటి విడతలో భాగంగా అభ్యర్థుల లిస్టును కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపనున్నది. ఈ సమావేశానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మానిక్‌రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్ హాజరయ్యారు. వార్ రూమ్ కాంగ్రెస్ కార్యాలయం ముందు నేతలను కలిసేందుకు కాంగ్రెస్ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ ఆశావాహులు పెద్ద ఎత్తున్న చేరుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు