Monday, April 29, 2024

నా భర్త మృతికి కారకులు కార్పొరేటర్‌గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌లే

తప్పక చదవండి
  • ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు
  • పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలి

కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తన భర్త నాయిని శ్రీనివాస్‌ మర ణానికి కారణమైన కార్పొరే టర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌ పై కరీంనగర్‌ రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి ఎందుకు అరెస్టు చేయడం లేదని నాయిని సరిత తెలి పారు. బుధవారం నగరం లోని ప్రెస్‌ క్లబ్‌ లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌ లు నా భర్త వద్ద నుంచి ఖర్చుల నిమిత్తం 8,50,000 రూపాయలు, మూడున్నర తులాల బంగారం తీసుకున్నారని, తిరిగి డబ్బులు అడిగితే వారు ఇవ్వమని. ఏం చేసుకోకుంటావో చేసుకోమని, మళ్లీ అడిగితే నిన్ను, నీ భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులు, వేధింపులకు గురి చేయడంతో నా భర్త ఆత్మహత్యకు పాల్పడి మరణించాడని సరిత ఆరోపించింది. ఈ విషయంలో రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినప్పటికి కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్‌ ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ అండదండలతోనే పోలీసులు అరెస్టు చేయడం లేదా అని అనుమానం వ్యక్తం చేసింది.నా భర్త మరణానికి కారణమైన కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలీసులకు కంటికి కనబడినా ఎందుకు అరెస్టు చేయడం లేదు. మా వద్దనే డబ్బులు తీసుకొని నా భర్త మరణించాక మాకు డబ్బులు, బంగారం ఇవ్వలేదని, గత నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పడం ఎంతవరకు సమంజసం. నా భర్త వద్ద డబ్బులు తీసుకున్నట్లు చెక్‌ ఉన్నప్పటికి నా సంతకం కాదని అనడం సరైంది కాదు. గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్‌ వేధింపులతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు శ్రీనిక(5), మనస్విన్‌(3) ఉన్నారు. నా జీవితం రోడ్డుపాలయింది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్‌ ను అరెస్టు చేసి నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు