Tuesday, May 14, 2024

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతాయి

తప్పక చదవండి

సికింద్రాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తార్నాక డివిజన్‌ లాలాగూడ లోని తక్షశిల పాఠశాలలో కార్నివాల్‌ ఆఫ్‌ క్రియేటివిటీ అండ్‌ నాలెడ్జ్‌ షో ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రత్యేకంగా బ్లూటూత్‌ రోబో పిల్లలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ తను ప్రీత్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలుస్తాయని అన్నారు. చిన్న పిల్లలు అయినా గొప్ప ఆలోచనలతో తమ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రదర్శనలలో పాల్గొన్నారని వారందరినీ ప్రశంసించారు. ఆవిష్కరణలు అనేవి ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేవిగా ఉండాలని అప్పుడే ప్రజలకు ఉపయోగ పడటమే కాకుండా అవిష్కరణలకు గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ప్రజల సమస్యల పరిష్కారానికి సులువైన యాంత్రిక పరికరాలు ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు