Thursday, May 2, 2024

సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా నేడు రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు

తప్పక చదవండి

జైపూర్‌ : రాష్ట్రీయ రాజ్‌పుట్‌ కర్ణి సేన చీఫ్‌ సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బంద్‌ పిలుపులో భాగంగా కర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సుఖ్ధేవ్‌ సింగ్‌ హత్యోదంతంపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణి సేన కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. సుఖ్ధేవ్‌ సింగ్‌కు భద్రత కల్పించాలని కోరామని, ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో ప్రభుత్వానికి లేఖలు రాశారని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కర్ణి సేన వ్యవస్ధాపకుడు లోకేంద్ర సింగ్‌ కల్వి కుమారుడు భవాని సింగ్‌ కల్వి వివరించారు. సుఖ్ధేవ్‌ సింగ్‌కు ఎందుకు భద్రత కల్పించలేదనేది ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. ఈ ఘటనపై అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దియా కుమారి స్పందిస్తూ కర్ణిసేన చీఫ్‌ హత్యగ్భ్భ్రాంతికి లోనుచేసిందని అన్నారు. ఈ ఘటనను ఖండిరచేందుకు తనకు మాటలు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. సుఖ్ధేవ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. సుఖ్ధేవ్‌ సింగ్‌ను మంగళవారం జైపూర్‌లోని ఆయన నివాసంలో సాయుధ దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు