Sunday, June 23, 2024

భార్య ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై వైద్యుడి ఆత్మహత్య

తప్పక చదవండి

లక్నో : ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్‌ అరుణ్‌ సింగ్‌.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్‌ ప్రాంతంలో గల మోడ్రన్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడు కంటి స్పెషలిస్ట్‌. అయితే, అరుణ్‌ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్‌ ప్రియదర్శి తెలిపారు. ఇంజక్షన్ల ద్వారా భార్య, పిల్లల్ని (14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబు) చంపినట్లు గుర్తించామన్నారు. ఆ తర్వాత అరుణ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు