Friday, May 17, 2024

అబద్దాల కోరు కేసీఆర్‌

తప్పక చదవండి
  • తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర
  • మంత్రివర్గంలో తెలంగాణద్రోహులు
  • బీఆర్‌ఎస్‌, బీజెపి, ఈసిలు ఒక్కటే
  • ఉద్యమానికి ఉస్మానియా పట్టుకొమ్మ
  • విలేకర్ల సమావేశంలో కె.నారాయణ

కొత్తగూడెం : అబద్దాల కోరు కేసీఆర్‌ అని, తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర పోషించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. స్థానిక శేషగిరిభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఖమ్మం జిల్లాలో చేసిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికింది సిపిఐ అని, నాటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ ఉద్యమాన్నితన బుజస్కందాలపై ఎత్తుకొని కేసీఆర్‌ దీక్షను విజయవంతం చేసిన వ్యక్తి అన్నారు. ఆమరణ దీక్షలోఉన్న కేసీఆర్‌కు ప్రాణహాని ఉందని తెలుసుకొని నాటిప్రభుత్వ అధికా రులతో సంప్రదింపులు చేసి ఆయన ఆరోగ్యం కోసం విలువైన వైద్యంఅందించడానికి వైద్యబృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈవిషయాన్ని కేసీఆర్‌ పదే పదే చావు అంచుల్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశార్థిక సామాజిక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజెపి పార్టీతో బీఆర్‌ఎస్‌ అంట కాగడం రాష్ట్ర ప్రజలను ఆలోచింప చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాని యా యూని వర్సిటీ విద్యార్థి సంఘాలు నాయకులు చేసిన పోరాటాలు గణనీయమై నవి అన్నారు. పోరాటాలతో సాధిం చిన తెలంగాణ నేడు బీజెపి నాయకులకు గులాం చేస్తుందన్నారు. రైతుబంధు,దళితబంధు, గృహలక్ష్మీ, బిసిబంధు లాంటి ప్రభుత్వ స్కీంలు ప్రజలకు అందాలంటే ప్రాతి నిధ్యం వహించేప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టాల్సిందేన న్నారు. బీఆర్‌ఎస్‌ పదిసంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగులను మోసం చేస్తూనే వస్తుందని, ఉద్యోగాలు లేవు నియామక పరీక్షలు వాయిదాలు లీకేజీలు కోర్టు కేసులతో సాగుతూనే వస్తుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీచేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డబ్బుమూటలు పంపిస్తున్నారన్నారు. ఈఎన్నికల సమయంలో రైతుబంధులాంటి ప్రభుత్వ స్కీంలు అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిపై బీజెపి సవతి తల్లిప్రేమ చూపిస్తుందని, నోటిమాటలకే అమృతం అభి వృద్ధి పనులకు ఆమడ దూరంగా బీజెపి అగ్రనాయకత్వం వహి స్తుందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజెపి పార్టీలు అస్తమిస్తున్న సూర్యుడి లాంటివి అన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరుపున పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కంకికొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు