Sunday, April 28, 2024

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో 2 సార్లు ప్రజల మైండ్ బ్లాంక్ అయ్యింది..

తప్పక చదవండి
  • ఈసారి బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరు
  • బీఆర్ఎస్ కు దమ్ముంటే… అమరవీరుల స్థూపం వద్దకొచ్చి
    మేనిఫెస్టోపై చర్చించే దమ్ముందా?
  • బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలేవి?
  • ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదు?
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
  • కేసీఆర్ ఆరోగ్యంపై మాకు అనుమానాలున్నయ్
  • కుటుంబమంతా దేవుడికి పూజలు చేస్తే… కేసీఆర్ కొడుకు
    ఎందుకు దూరంగా ఉన్నాడు?
  • సిరిసిల్లలోనూ కేటీఆర్ కు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు

( రజాకార్ సినిమా రిలీజ్ కాకముందే బీఆర్ఎస్ నేతలకు అంత భయమెందుకు? ఎంఐఎంకు భయపడి అడ్డుకోవాలని చూస్తున్నారు.. బీఆర్ఎస్ ఎంగిలి మెతుకులకు ఆశపడే నీచమైన పార్టీ ఎంఐఎం.. ఆ పార్టీకి చీము, నెత్తురుంటే… తెలంగాణ అంతటా పోటీ చేసి దమ్ము చూపాలి.. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మేదెవరు? రాహుల్ గాంధీ 50 ఏళ్లకు ‘‘మెచ్యూర్’’ కావడమా?… ఇగ పెళ్లి చేసుకునేదెప్పుడు? పిల్లలను కనేదెప్పుడు? దేశంలో ఎన్నికల కోసం తెలంగాణను ఏటీఎంగా వాడుకునేందుకే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటోంది? డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో అభివ్రుద్ధి సాధ్యం…బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం.. : ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. )

హైదరాబాద్ : ‘‘బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండు సార్లు ప్రకటించిన మేనిఫెస్టోతోనే ప్రజల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈసారి ప్రజలే బీఆర్ఎస్ పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరు.’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా చెత్తబుట్టకే పరిమితం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు శరం ఉంటే… మేనిఫెస్టో హామీలెందుకు అమలు చేయలేదో అమర వీరుల స్థూపం వద్దకు వచ్చి చర్చించేందుకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలవాలని కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తొత్తులుగా పనిచేసే వాళ్లకే పోస్టింగులిచ్చుకున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ బుధవారం రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మేదెవరని ప్రశ్నించారు. ఎంగిలి మెతుకులకు ఆశపడే నీచమైన పార్టీ ఎంఐఎం అని చెప్పిన బండి సంజయ్ ఆ పార్టీకి చీమునెత్తురుంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ తోపాటు తెలంగాణ అంతటా బీఆర్ఎస్ నేతల అవినీతి అరాచకాలు, భూకబ్జాలను భరించలేక ప్రజలు అల్లాడుతున్నరు. వారికి భరోసా ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వారికి బీజేపీ దిక్సూచీలా కన్పిస్తోంది. ప్రజల ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. కరీంనగర్ లోనూ గెలుస్తం. ఎందుకంటే తెలంగాణలో అభివ్రుద్ధికి నిధులన్నీ కేంద్రానివే… అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు వారం రోజుల్లో పరిహారం ఇస్తానని ప్రకటించిన కేసీఆర్… ఇప్పటి వరకు ఎంతమందికి పైసలిచ్చారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఇంతో అంతో అభివ్రుద్ధి చెందిందంటే అది కేంద్రం ఇస్తున్న నిధులతోనే… గ్రామీణ సడక్ యోజన కింద వేస్తున్న రోడ్ల నిధులు, జాతీయ రహదారుల నిధులు, రేషన్ బియ్యం ఎవరివి? గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులు ఎవరివి? అమ్రుత్, స్మార్ట్ సిటీ కింద ఇస్తున్న నిధులెవరివి? పీఎంఏవై కింద 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి నిధులిస్తే.. ఇండ్లు కట్టకుండా దారి మళ్లించెందెవరు? బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్ని నిధులిస్తుందో…. కేంద్రం ఎన్ని నిధులిస్తోందో చర్చకు సిద్ధమా? రోజ్ గార్ మేళా పేరిట ఇప్పటి వరకు కేంద్రం 4 లక్షల ఉద్యోగాలిచ్చింది. మరి బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి. రైతులు పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్తే మాపై దాడులు చేసిన బీఆర్ఎస్ నేతలు… ధాన్యం తామే కొంటామని, కేంద్రంతో పనిలేదని ప్రగల్భాలు పలికారు కదా? ఏమైంది? గోనె సంచి, సుతిలీ తాడుసహా రవాణ ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బ్రోకర్ పాత్ర మాత్రమే పోషిస్తోంది. దానికి కమీషన్ కూడా కేంద్రమే ఇస్తోంది. ఉపాధి హామీ నిధులు కూడా కేంద్రమే ఇస్తోంది. టాయిలెట్ల నిర్మాణ నిధులు కేంద్రమే ఇస్తోంది. అన్నీ కేంద్రమే ఇస్తుంటే మీరు చేస్తుందేమేటి? రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలను బంద్ చేసిన మూర్ఖుడు కేసీఆర్.

నేను మొన్న మాట్లాడిన వ్యాఖ్యలను బూతు పేపర్ పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్దాలాడింది. నేనట బీఆర్ఎస్ ను గెలిపించాలని చెప్పానట. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తే, ఫస్ట్ నాడు ఉద్యోగులకు జీతాలిస్తుంటే, గ్రూప్ 1, డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తే, ఇంటికో ఉద్యోగం ఇస్తే….డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఆ పార్టీకి ఓటేయాలని చెప్పిన. మరి అవన్నీ పూర్తి చేశారా? చేయకపోగా… నా మాటలను వక్రీకరిస్తూ బూతు పత్రిక రాస్తుందంటే అంతకంటే నీచం, సిగ్గు చేటు ఇంకోటి ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తుండటంతో బూతు పత్రిక విషం కక్కుతోంది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు జరపాలి. కొందరు అధికారులు బీఆర్ఎస్ కు తొత్తుగా మారుతున్నరు. ప్రతిపక్ష పార్టీ నేతల, సామాన్య ప్రజలను వేధిస్తున్నరు. బీఆర్ఎస్ తొత్తులుగా ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయాలి. అట్లాగే ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయలేదు? వారేమైనా చట్టానికి అతీతులా? వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ వంద సీట్లకుపైగా అభ్యర్థులను ప్రకటించారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా ఉంది. మోదీ, అమిత్ షా సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజలు వాస్తవాలు ఆలోచిస్తున్నరు. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారమిస్తే 5 లక్షల కోట్ల అప్పును 10 లక్షల కోట్లు చేస్తది. కాంగ్రెస్ కు అధికారమిస్తే అప్పులెలా తీరుస్తది? అభివ్రుద్ధి ఎలా చేస్తదని ఆలోచిస్తున్నరు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివ్రుద్ధి సాధ్యమని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజల కష్టాలెలా తీరుస్తారు? అప్పులెలా తీరుస్తారు? అభివ్రుద్ధి ఎలా చేస్తారు? ఇచ్చిన హామీలెందుకు అమలు చేయలేదో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి చర్చించే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా? బీఆర్ఎస్ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పిన కేసీఆర్ దానిని చెత్తబుట్టలో వేస్తే ఆ పాపం ఊరికే పోతదా? అమరవీరుల ఉసురు ఊరికే పోతదా? కేసీఆర్ కొడుకు అహంకారంతో విర్రవీగుతున్నడు. ఆయన ముఖం చూసి ఓట్లెవరేస్తారు? రాష్ట్రం మొత్తం దేవుడెరుగు… సిరిసిల్లలోనే కేసీఆర్ కొడుకుకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు… నేనడుగుతున్నా… కేసీఆర్ ఎటు పోయిండు? ఎందుకు బయటకు రావడం లేదు? కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదని… ఆయన భార్య, కుటుంబ సభ్యులు గుడికిపోయి పూజలు చేస్తూ తలనీలాలు అర్పిస్తుంటే… మరి కొడుకుకు ఏం పుట్టింది? ఎందుకు పోవడం లేదు? ప్రత్యర్థులమైన మేమే కేసీఆర్ బాగుండాలని కోరుకుంటుంటే… ఆయనకేం పుట్టింది? నాకున్న బాధ కూడా కొడుకుకు లేదంటే ఏమనుకోవాలి? అందుకే ప్రజలకు అనుమానం వస్తుంది. అసలాయ గుడికి పోయి ఎందుకు మొక్కడం లేదు? దేవుడిని నమ్మని నాస్తికుడివా? లేక తలనీలాలిస్తే నీ గ్లామర్ దెబ్బతింటదని భయమా? కేసీఆర్ కు ఏమైందోననే ప్రజలు ఆందోళనలో ఉంటే… ఎందుకు బయటకు తీసుకురావడం లేదో? చెప్పాలి. ఫాంహౌజ్ లో తాంత్రిక పూజలు చేస్తుందెవరో ప్రజలకు తెలుసు.

రజాకార్ సినిమా తీస్తే మీకెందుకు భయం? రజకార్ ఏమైనా గొప్పోడా? నిజాం ఏమైనా గొప్పోడా? నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఇబ్బందేమిటి? సినిమా రిలీజ్ కాకముందే భయపడుతున్నారంటే… బీఆర్ఎస్ నాయకులు రజాకార్ వారసులుగా భావిస్తున్నం. నిజాం సమాధి ముందు మోకరిల్లిన మూర్ఖులు. రజాకార్ సినిమాలో ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లండి.. రాహుల్ గాంధీ మెచ్యూర్ అయ్యిండా? హహ్హహ్హ… 50 ఏళ్లకు రాహుల్ గాంధీ మెచ్యూర్ అయ్యిండంటే.. ఇగ పెళ్లెప్పుడు చేసుకుంటడు? ఎప్పుడు పిల్లలను కంటడు.. ఎప్పుడు దేశాన్ని పాలిస్తడు? సిగ్గుండాలే… రాహుల్ గాంధీకి ఇన్నాళ్లు బుద్ది పెరగలేదని వాళ్లే ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా కాంగ్రెస్ వారంటీ లేని పార్టీ. ఇగ వాళ్లిచ్చే గ్యారంటీలను నమ్మేదెవరు? పొరపాటున కాంగ్రెస్ కు అధికారమిస్తే కేంద్రం ఇచ్చే పైసలతోపాటు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టే పైసలను కూడా దోచుకుంటరు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అయ్యే ఖర్చుకు తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటరు. నేను ఎక్కడ పోటీ చేయాలనే విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్. కరీంనగర్ నుండి పోటీ చేయాలనే ఆలోచన ఉందని నా అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పిన. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందనే విషయాన్ని చెప్పిందే అక్బరుద్దీన్ ఒవైసీ. మేం చెప్పిన వాళ్లకే పదవులొస్తాయి. మేం చెప్పిన వాళ్లే పాతబస్తీలో పోటీ చేస్తారు? మా అనుమతి లేనిదే పాతబస్తీకి రాలేదని ఒవైసీ చెప్పిన విషయం వాస్తవం కాదా? దారుస్సలాంకు జీ హుజూర్ అంటోందెవరు? ఎంఐఎం ఎంగిలి బతుకుల కోసం సూట్ కేసులు పంపుతోందెవరు? ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటి కాదని భావిస్తే, వాళ్లు ఎంగిలి మెతుకులకు ఆశపడటం లేదని భావిస్తే… నిజంగా అల్లా భక్తులైతే, మైనారిటీల పక్షాన ఉంటే, మీరు మనుషులైతే… ఎంఐఎం నేతలు తెలంగాణ అంతటా పోటీ చేయాలి. దమ్ము చూపాలి. నా సవాల్ ను స్వీకరించాలి. కానీ ఆ పార్టీకి చీమ నెత్తురు లేదు. ముస్లిం సమాజం కూడా ఎంఐఎం పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. పాతబస్తీ ముస్లిం పెద్దలు కూడా చాలా మంది ఫోన్ చేసి పాతబస్తీని న్యూసిటీగా ఎందుకు మారడం లేదని, ఎంఐఎం నేతలు మోసం చేస్తున్నారని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల ప్రకారం… బీజేపీ తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేస్తుంది. అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. నేను భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద మీటింగ్ పెడితే… పాతబస్తీలో భాగ్యలక్ష్మీ గుడి ఎక్కడిది? హిందూ ముస్లింలకు మధ్య కొట్లాట పెడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఆ తరువాత ఏమైంది? రేవంత్ రెడ్డి, కవితతోపాటు చివరకు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. ఆ ఘనత ఎవరికి దక్కుతుందో మీరు ఆలోచించుకోవాలని తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు