Friday, May 3, 2024

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌..!

తప్పక చదవండి

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫలితాలు వెలువడనున్న తరుణంలో టీసీఎస్ కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 173 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 189 పాయింట్లు లాభపడ్డాయి. ఈరోజు మార్కెట్లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు ఎక్కువగా ట్రేడింగ్ చేయబడ్డాయి.
ఉదయం 66,376.42 పాయింట్ల వద్ద లాభాలతో మొదలై.. ఇంట్రాడేలో 66,592.16 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 393.69 పాయింట్ల లాభంతో 66,473.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121.50 పాయింట్ల లాభంతో 19,811.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,275 షేర్లు పురోగమించగా.. 1283 షేర్లు క్షీణించాయి. 132 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, టీసీఎస్‌ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్ మినహా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, పవర్, ఆయిల్ అండ్‌ గ్యాస్‌ రియల్టీ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు