Monday, April 29, 2024

ఫస్ట్ లిస్ట్ రెడీ..

తప్పక చదవండి
  • 52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా జాబితా..
  • తెలంగాణ ముఖ్యనేతలందరికీ అవకాశం..
  • సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి..
  • ఆమోదం తెలిపిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ..

హైదరాబాద్ : ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి లిస్టులో బీసీలతో పాటు సీనియర్ల నేతలకు స్థానం కల్పించారు. ముగ్గురు పార్లమెంటు సభ్యులు సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, బోథ్ నియోజకవర్గం నుంచి సోయం బాపూరావు, కోరుట్ల స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు.పార్టీ ముఖ్య నేత, సీనియర్ అయిన ఈటల రాజేందర్‌ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నుంచే కాక కేసీఆర్ పోటీకి దిగుతున్న గజ్వేల్ నుంచి కూడా బీజేపీ పోటీకి దింపనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా.. ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు నలుగురు నుంచి ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో దింపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ముగ్గురు పార్లమెంటు సభ్యులు సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, బోథ్ నియోజకవర్గం నుంచి సోయం బాపూరావు, కోరుట్ల స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు.పార్టీ ముఖ్య నేత, సీనియర్ అయిన ఈటల రాజేందర్‌ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నుంచే కాక కేసీఆర్ పోటీకి దిగుతున్న గజ్వేల్ నుంచి కూడా బీజేపీ పోటీకి దింపనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా.. ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు నలుగురు నుంచి ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో దింపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు