Wednesday, May 15, 2024

బతుకుల్లో సంబురం నింపే. బతుకమ్మ, దసరా..!

తప్పక చదవండి
  • వ్యాపారులకు సిరులు కురిపిస్తున్న పువ్వులు.
  • రంగుల వ్యాపారంకు బలే గిరాకీ.
  • ఫుట్ పాత్ వ్యాపారాణికి మంచి ఆదరణ..
  • ప్రస్తుతం వస్త్ర అలంకరన షాపులు బిజీ బిజీ..
  • స్వర్ణ కారులు.. టైలర్లకు చేతి నిండా పని.
  • జూవెల్లర్స్ షాపులోనూ ఆడపడుచుల సందడి.
  • వస్త్ర వ్యాపారులు బిజీబిజీ.. అలంకరణ షాపులు కళకళ..

మెడ్చల్ : సబ్బండ వర్గాల్లో ఆనందం నింపే సద్దుల బతుకమ్మ పండుగ.. బతుకమ్మ అంటే తొమ్మిది రోజుల ఉత్సవమే కాదు.. సబ్బండ వర్గాలకు ఉపాధినిచ్చే వేడుక… ముఖ్యంగా పూలు సాగు చేసే రైతులు.. ఆ పూలు అమ్మే వ్యాపారులకు సిరులు కురిపించే పండుగ.. నెల రోజుల పాటు వస్త్ర అలంకరణ దుఖానాలకు భారీ గిరాకి నిచ్చే పండుగ.. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి చేతి నిండా పని కల్పించే సంబురం.. అందుకే ఈ పండుగ వచ్చిందంటే బడుగు, బలహీన వర్గాల్లోనే కాదు.. వాణిజ్య వర్గాల్లోనూ ఆనందం కనిపిస్తుంది. బతుకమ్మ అంటేనే తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వేడుక.. పూలకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పండుగ సీజన్లో పూల వ్యాపారంపై ఆధారపడి వందలాది మంది ఉపాధి పొందుతుంటారు. ఈ ఏడాది వందలాది ఎకరాల్లో బంతి, గుండు బంతి, చామంతి, పట్టకుచ్చు, లిల్లీ, గుణుగు తదితర పూల మొక్కల సాగు చేశారు. ప్రస్తుతం అవి విరివిగా పూస్తుండడంతో వాటిని మార్కెట్ కు తరలిస్తున్నారు.
కొందరు గ్రామాల వద్దకు వచ్చే వారికి హోల్ సెల్ గా అమ్మితే.. మరి కొందరు నేరుగా మార్కెట్ లో ఉంచి కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా దారిపొడవునా పూల దుఖానాలే దర్శనం ఇస్తున్నాయి. అంతే కాకుండా ఇదే సమయంలో రంగుల వ్యాపారులు కూడా ఉపాధి పొందుతున్నారు. బతుకమ్మ తయారీలో వాడే కలర్లకు మంచి గిరాకీ ఉండడంతో షాపులు కిటకిట లాడుతున్నాయి.

వస్త వ్యాపారులు బిజీబిజీ :
బతుకమ్మ, దసరా పండుగల సందర్భాల్లో వస్త్ర వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే మొన్నటి వరకు బోసి పోయి కనిపించిన మార్కెట్ నెల రోజుల నుంచి జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఉన్న వస్త్ర వ్యాపారులు నెల రోజుల ముందు నుంచి క్షణం తీరికలేకుండా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కొత్త కొత్త డిజన్లతో తయారు చేసిన బట్టలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీంతో అందరి చూపు కొత్త రకాలపై పడింది. దీంతో గ్రామాల్లోని ప్రజలు కొత్త రకం డిజైన్లను పండుగకు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతే కాకుండా నెల రోజుల్లో వస్త్ర వ్యాపారులు లాబాలతో పాటు, అనేక మందికి ఉపాధికల్పిస్తున్నారు.

- Advertisement -

అలంకరణ షాపులు కళకళ :
బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ. ఈ పండుగకు మహిళలు కొత్త చీరలతో పాటు అలంకరణ సామాగ్రికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పండుగ ముందు నెల రోజుల ముందు నుంచి లేడీస్ ఎంపోరియం. కంగన్ హాల్. ఇమిటేషన్ జువెల్లరి షాపులకు క్యూ కడుతున్నారు. చీరలకు మ్యాచ్ అయ్యే గాజులు, పిన్స్, లోలాకులు, జుంకాలు, రబ్బర్ బాండ్స్, ఇతర సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. జువెల్లర్స్ లోనూ సందడి నెలకొంది..

ఏ పండుగకు లేకున్నా బతుకమ్మ పండుగకు మాత్రం మహిళలు తప్పని సరిగా నగలు చేయించుకుంటారు. పిల్లలు పట్టీలు. పెద్దలు ఆభరణాలు చేయించుకుంటారు.. దీంతో స్వర్ణ కారులకు చేతి నిండా పని దొరుకుతుంది. ముఖ్యంగా కొత్త నగలు చేయడం, పాత నగలకు మెరుగులు దిద్దడం వంటి పనుల్లో బిజీగా ఉంటున్నారు. టైలర్లకు బతుకమ్మ పండుగకు చేతి నిండా పని దొరుకుతోంది. లేడీస్ టైలరింగ్ షాపులు క్షణం తీరిక లేకుండా ఉంటున్నాయి. చీరలకు పీటో హాల్స్, డ్రస్ లు కుడుతూ టైలర్లు తమ వ్యాపారాలను కొన సాగిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు