Tuesday, May 21, 2024

మహేంద్ర సింగ్‌ ధోనీపై ఫిక్సింగ్‌ ఆరోపణలు..

తప్పక చదవండి
  • ఐపీఎస్‌ అధికారికి 15 రోజుల జైలు శిక్ష

ఐపీఎల్‌ 2013 బెట్టింగ్‌ స్కాండల్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ కారణంగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై నిషేధం కూడా విధించారు. అయితే ఇదే స్కామ్‌కు సంబంధించి అప్పట్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి జీ సంపత్‌ కుమార్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ధోని 2013 ఐపీఎల్‌ సమయంలో బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడం టూ సంచలన ఆరోపణలు చేశారు సంపత్‌ కుమార్‌ . దీంతో ధోని కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి జీ సంపత్‌ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం (డిసెంబర్‌ 15) తీర్పును వెలువ రించింది. అయితే ఈ 15 రోజుల శిక్షపై అప్పీలు చేసుకోవడానికి సంపత్‌ కుమార్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది. ఇదే విషయమై గతంలో కొన్ని మీడియా సంస్థలు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి సంపత్‌ కుమార్‌ తదితరులపై ధోనీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 2013 ఐపీఎల్‌ సమ యంలో బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడంటూ తనపై దురుద్దేశపూర్వకమైన ప్రకటనలు, నివేదికలు ఇచ్చారని ధోని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సంపత్‌ కుమార్‌ తదితరులు తనపై తప్పుడు ప్రకటనలు చేయకుండా లేదా ప్రచురించకుండా అడ్డుకోవాలని ధోనీ విజ్ఞప్తి చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు, ధోనీపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇవ్వకుండా మీడియా సంస్థలు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి సంపత్‌ కుమార్‌ తదితరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరూ కోర్టు ఆదేశాలను ఫాలో అయ్యారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కూడా బెట్టింగ్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి సంపత్‌ కుమార్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధోనీ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారికి 15 రోజుల జైలు శిక్ష విధించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు