Sunday, May 12, 2024

కేసీఆర్ నీ కొడుకును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా.. ?

తప్పక చదవండి
  • అజయ్ రావు కండకావరం తలకెక్కి మాట్లాడుతున్నడు..
  • ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకుని నీ చరిత్ర మాకు తెలియదా?
  • ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించావో తెల్వదా?
  • కేసీఆర్ నెలరోజులుగా బయటకు ఎందుకు రావడం లేదు?
  • ట్రిబ్యునల్ ఏర్పాటు, పసుపుబోర్డు, గిరిజన వర్శిటీ ఏర్పాటైనా స్పందించరా?
  • ట్రిబ్యునల్, పసుపు బోర్డు ఏర్పాటు కేసీఆర్ కు ఇష్టం లేదా?
  • క్రిష్ణా వాటాలో తెలంగాణకు తీరని ద్రోహం చేసిన మోసగాడు కేసీఆర్
  • కేసీఆర్ కుటుంబంపై అనేక అనుమానాలున్నాయ్
  • వెంటనే కేసీఆర్ ను ప్రజల ముందు హాజరుపర్చాలని కోరతున్నా
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ : కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందని, మెడమీద తలకాయ ఉన్నోళ్లెవరూ ఆ పార్టీకి ఓట్లేయబోరని చెప్పారు.
గురువారం రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కొండేటి శ్రీధర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.

పసుపు బోర్డు, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుతోపాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న క్రిష్ణా ట్రిబ్యునల్ కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రధాని మోదీకి, కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు.. క్రిష్ణా జలాల వాటా, వివాదాలు పరిష్కారం కాబోతున్నాయి. ఎడారిగా మారిన దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశముంది. క్రిష్ణా జలాల వాటాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు… నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్కక్కై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను రాకుండా అడ్డుకున్న నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్. ఉమ్మడి ఏపీలో క్రిష్ణా నికర జలాల వాటా 1005 టీఎంసీలు. తెలంగాణకు 575 టీఎంసీలు. ఏపీ, తెలంగాణకు సంబంధించి 2015లో జూన్ 18, 19 తేదీల్లో నీటి పంపకాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా కేసీఆర్ నీటి పంపకాలపై నోరు మెదపలేదు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన డబ్బుల మూటకు ఆశపడి 299 టీఎంసీల నీటికే అంగీకరిస్తూ సంతకం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్. 2015లో క్రిష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన కేసీఆర్… ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ ఏటా ఒకసారి కేంద్రానికి లేఖ రాయడం కేసీఆర్ కు పరిపాటిగా మారింది. బట్టేబాజ్ బుద్దులు… మోదీ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. సీఎం లేఖలకు ఎప్పటికప్పుడు రిప్లై ఇచ్చినా ప్రజలకు ఆ విషయాన్ని దాచి 9 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన నీచుడు కేసీఆర్.

- Advertisement -

కేసీఆర్ చేస్తున్న బదనాంను వివరిస్తూ మేం లేఖ రాస్తే… 2020 అక్టోబర్ 6న కేంద్రం ఏర్పాటు చేసిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే… సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రం నీటి ప్రాజెక్టుల టెండర్లు వేస్తున్నందున… అది పూర్తయితేనే డబ్బులు ముడతాయనే భావనతో ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఏపీ, తెలంగాణ కాంట్రాక్టర్ ఒక్కరే. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదని… వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెబితే… అంగీకరించిన కేసీఆర్ బయటకొచ్చిన తరువాత ఏడాదిన్నరపాటు జాప్యం చేసిన మూర్ఖుడు కేసీఆర్. మేం పదేపదే కేసీఆర్ తీరును ఎండగడుతుంటే ప్రజలకు వాస్తవాలు అర్ధమైందని తెలిసి… ఏడాది క్రితం పిటిషన్ ను ఉపసంహరించుకున్నది నిజం కాదా? ఆ తరువాత కేంద్రం న్యాయశాఖ అభిప్రాయం మేరకు ట్రిబ్యునల్ కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేసీఆర్ 9 ఏళ్లుగా నాన్చడంవల్ల, ఏపీతో కుమ్కక్కు కావడంవల్లే ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యమైంది. కేసీఆర్ తీరువల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా ప్రమాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడక నెలరోజులాయే. మా గురువుగారిని మీరు ఏం చేశారు? ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నాక కూడా కేసీఆర్ బయటకు ఎందుకు రాలేదు? పీఎంకు థ్యాంక్స్ చెప్పలేదు? కేసీఆర్ యాడున్నడో.. ఏం చేస్తున్నడో కనీసం ఆయన బూతు ఛానల్ అయినా ఎందుకు చూపించడం లేదు? కేసీఆర్ కు ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయడం ఇష్టం లేదా? దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావడం నచ్చడం లేదా? అక్కడి ప్రజలు వలసలు పోవాలని కోరుకుంటున్నారా?

గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేసినా, పసుపు బోర్డు వేసినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదా? పసుపు రైతులు బాగుపడటం మీకు ఇష్టం లేదా? గిరిజన వర్శిటీ రావడం నచ్చలేదా? ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి రావాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉంది. కేసీఆర్ అంతటి ఇంజనీర్ ఈ భూ ప్రపంచంలోనే లేడేమో… పూర్తికాని పాలమూరు ప్రాజెక్టు నుండి ఒక్క మోటార్ ఆన్ చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే బడా ఇంజనీర్ కేసీఆర్… నదులకు నడక నేర్పారట.. ఇప్పుడు డ్యాన్స్ చేయిస్తాడట…కేసీఆర్ యాడికి పోయినా కాళేశ్వరం నీళ్ల్లతో మీ కాళ్లను కడుగుతానని మోసం చేసిండు… పాలమూరు ప్రాజెక్టు సగం కూడా పూర్తి కాలేదు. కాలువల నిర్మాణం పూర్తి కాలే. భూ సేకరణ చేయలే. మరి నీళ్లెట్లా ఇస్తాడో చెప్పాలి. అసలు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా సాధ్యం? డీపీఆర్ లో నీటి కేటాయింపుల ముచ్చటే లేదు. పర్యావరణ అనుమతుల్లేవు. మరి హోదా ఎట్లా సాధ్యం? బిడ్డా, కొడుకు, అల్లుడుతో కలిసి దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ కుటుంబం పని. కేసీఆర్ కు మందు గోళీలు ఇచ్చే సడ్డకుడి కొడుకును ఇంట్లో నుండి బయటకు ఎందుకు వెళ్లగొట్టాడో చెప్పాలి? కేసీఆర్ కొడుకు అజయ్ రావును ముఖ్యమంత్రి చేస్తానని మోదీకి చెప్పింది నిజం కాదా? దమ్ముంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి. నేను సవాల్ చేస్తున్నా… కేసీఆర్ తన కొడుకును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా? ఆయనకు తప్ప వేరెవరినీ సీఎం చేయబోనని చెప్పే దమ్ముందా? ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ చీలిపోతుంది. నీ కొడుకు అహంకారం చూసి మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవరూ బీఆర్ఎస్ కు ఓట్లేయరు. కేసీఆర్ కొడుకుకు కండకావరం తలకెక్కింది. బిడ్డా.. నీ అర్హత సీఎం కొడుకు మాత్రమే. ఆయన లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని జీవితం నీది. వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్. ప్రజల సొమ్మును దోచుకున్నది నిజం కాదా? లక్షలు, కోట్ల ఆశచూపి బీజేపీ నేతలను బీఆర్ఎస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. థూ… ధైర్యంగా కొట్లాడే దమ్ములేని బతుకు మీది. పొరపాటున కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే… తెలంగాణ పరిస్థితి శ్రీలంక మాదిరిగా మారుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నా. ఢిల్లీ గులాంలు మాకొద్దని చెబుతున్న కేసీఆర్… ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజలు గులాం కావాల్నా? గతంలో గుజరాత్ బిడ్డకే వంగి వంగటి పాదాభివందనం చేసిన సంగతి మర్చిపోయినవా?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు