Tuesday, October 15, 2024
spot_img

సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

తప్పక చదవండి
  • జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఘటన
  • మధ్యాహ్నం 2.47కి కూలిపోయిన విమానం
  • విమానం కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన కోస్ట్ గార్డ్స్

అమెరికాకు చెందిన యుద్ధ విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. విమానం కుప్పకూలిన విషయాన్ని కోస్ట్ గార్డ్స్ ధ్రువీకరించారు. మరోవైపు విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై అమెరికా డిఫెన్స్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు విమానంలో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జపాన్లో లోని యూఎస్ బలగాల ప్రతినిధి పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన ఎస్ప్ర్పే సంస్థ విస్తరణ జపాన్లో వివాదాస్పందగా మారింది. ఈ హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలను అమెరికా సైన్యం, జపాన్ కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తి సురక్షితమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఆగస్టులో ఇదే యూఎస్ ఎస్ప్రే విమానం ఉత్తర ఆస్ట్రేలియా తీరంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2016 డిసెంబర్లో లో కూడా జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావా సముద్రంలో మరో విమానం ప్రమాదానికి గురైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు