Thursday, May 16, 2024

ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే..

తప్పక చదవండి
  • ఇప్పటికే స్లిప్పులు పంపిణీ చేసిన ఎన్నికల సంఘం
  • స్లిప్పులు రానివాళ్లు వివిధ మార్గాలలో పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు
  • టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

తెలంగాణలో గురువారం నాడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ నాడు సెలవు ప్రకటించింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా, ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే, ఎన్నిసార్లు ఓటు వేసినా.. వేయడానికి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తమతో ఏమేం తీసుకువెళ్లాలి అనే విషయంలో.. కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీ వద్ద ఓటరు కార్డు ఉంటే ఆ నెంబర్‌ను 1950, 9211728082 నెంబర్లకు పంపిస్తే మీ పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో మీకు లభిస్తాయి. ఇరవై నాలుగు గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ సాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నెంబర్, క్రమసంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ఎన్నికల సంఘానికి చెందిన ఓటర్ హెల్ప్ లైన్, యాప్ డౌన్ లోడ్ చేసుకొని కూడా వివరాలు పొందవచ్చు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ https://electoralsearch.eci.gov.in/ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోని ఆస్క్ వోటర్ సహ్య మిత్ర చాట్ బాట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు వివరాలు, ఎపిక్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఆధారంగా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులు ఇవే

  • ఓటరు ఫోటో గుర్తింపు కార్డు
  • ఆధార్ కార్డు
  • ఉపాధి హామీ జాబ్ కార్డ్
  • ఫోటోతో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డ్
  • కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్
  • ఎన్ పి ఆర్ కింద ఆర్ జిఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్
  • భారతీయ పాస్పోర్ట్
  • మీ ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు

వీటికి అనుమతి లేదు..
ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు బూత్ లోపలికి సెల్ఫోన్లు, కెమెరాలు, ల్యాప్టాప్ లు తీసుకెళ్లడం అనుమతి లేదు. పోలింగ్ బూత్ లోపల సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడం నిషేధం. ఇలా చేస్తే అరెస్ట్ కూడా చేస్తారు. మీరు వేసిన ఓటు కూడా లెక్కించరు. పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, పార్టీల రంగులు కలిగిన దుస్తులను సూచించే రంగు టోపీలను ధరించడం నిషేధం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు