Friday, May 3, 2024

అ‘క్రమబద్ధీకరణ’ పై కొరడా

తప్పక చదవండి
  • జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ : జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అందాయి. దీంతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అనుమతులు నిలిపేయాలన్నారు. ఈ మేరకు చీఫ్‌ సిటీ ప్లానర్‌, జోనల్‌ కమిషనర్లు, అదనపు సిటీ చీఫ్‌ ప్లానర్లు, సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు, సహాయ సిటీ ప్లానర్లను కమిషనర్‌ ఆదేశించారు. అక్రమ క్రమబద్ధీకరణపై ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కమిషనర్‌ చర్యలు చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు