Sunday, May 5, 2024

అమ్మో ఏమిటీ అవినీతి.. ?

తప్పక చదవండి

(అమోయ్‌ కుమార్‌ ను చూసి సిగ్గుపడుతున్న అవినీతి.. )

  • ఒకటా రెండా? ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మరకలే..
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఆయన చేయని అక్రమాలు లేవు..
  • అప్పట్లో రూ. 25 వేల కోట్ల భూమాయ చేసినట్లు ఆరోపణలు..
  • కిందిస్థాయి అధికారులను కనుసన్నలలో పెట్టుకోని వ్యవహరం
  • ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్‌ లు
  • మండల స్థాయి అధికారుల రిపోర్ట్‌ లేకుండానే టీ ఎం 33 మాడ్యూల్స్‌ లో, కోర్టు కేసులో ఉన్న దరఖాస్తులు అప్రూవల్‌ చేయించడంలో ప్రముఖ పాత్ర..

స్థాయి మరచి అవినీతికి పాల్పడుతున్న బ్యూరోక్రాట్స్‌ కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. గత ప్రభుత్వాల ఊడిగం చేసి అంతులేని అక్రమాలు చేసిన వారిని కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌ గా తీసుకుని వారికి బుద్ధి చెప్పి.. భజవిష్యత్‌ లో ఇలాంటివి జరక్కుండా చూసుకోవాలని పలువురు కోరుతున్నారు.. లెక్కలేని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమోయ్‌ కుమార్‌ ఐఏఎస్‌ చేసిన మరో ఘనకార్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

- Advertisement -

మాడ్గుల మండలం, నాగిళ్ళ గ్రామ రెవిన్యూ పరిధిలోని, ఫిరోజ్‌ నగర్‌ గ్రామానికి చెందిన మందుముల అభిలాష్‌ 11- 05 – 2022 తేదిన ఆర్‌ సి నెంబరు 2200013137.. మందుముల జానకి రామారావు 04 – 08 – 2022 తేదిన ఆర్‌ సి నెంబరు 2200085743 గల అప్లికేషన్‌ లు మీసేవలో.. కలెక్టర్‌ కి పాసుబుక్‌ లు మంజూరు చేయమని అర్జీ పెట్టుకున్నారు. కానీ మండల రిపోర్ట్‌ లేకుండానే టీ ఎం 33 మాడ్యూల్స్‌ లో, అప్లికేషన్‌ కోర్ట్‌ కేసు వున్నా ఈ దరఖాస్తులను కలెక్టర్‌ ఆఫీస్‌ లో అప్రూవల్‌ చేశారు. సుమారు 7 ఎకరాల భూమి ఆన్లైన్‌ లో అక్రమంగా నమోదు అయింది.. అట్టి సర్వే నెంబర్లపై వారిద్దరికి పట్టాదారు పాసుబుక్‌ లు మంజూరు అయ్యాయి.. రంగారెడ్డి కలెక్టర్‌ గా ఆమెయ్‌ కుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో కలెక్టర్‌ ఆపరేటర్‌ గా పని చేసిన ఎం. క్రాంతి కుమార్‌ లక్షల రూపాయలు దండుకొని అప్రూవల్‌ చేశాడని రైతులు పేర్కొన్నారు. యేండ్ల తరపడి ఫిరోజ్‌ నగర్‌ గ్రామానికి చెందిన 53 మంది రైతులు భూమి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములపై పిజికల్‌ పొజిషన్‌ సర్వే చేయకుండా ఒకే కుటుంబం అయిన మందుముల వారసులపై 183 ఎకరాలకు ఓ ఆర్‌ సి రావడం రంగారెడ్డి జిల్లాలోనే హాట్‌ టాపిక్‌ గా మారింది. పట్టాదారు పాసుబుక్‌ ల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా దక్కని హక్కు పత్రాలు మాడుగుల తహసీల్దార్‌ కార్యాలయం లో మందుముల వెంకట రామారావు కొందరు అధికారులతో కుమ్మక్కై రికార్డులను మార్పిడి చేసి, తానే వారి పేర్లను నమోదు చేసి, రాసుకున్న భూ రికార్డులను కార్యాలయంలో భద్రపరిచి రైతుల పేర్లు మాయం చేసి.. 1963 నుండి 1976 వరకు నాగిళ్ళ గ్రామానికి చెందిన భూ రికార్డులను తహసీల్దార్‌ కార్యాలయంలో కనుమరుగు చేసాడని అతనిపై మాడుగుల పోలీస్‌ స్టేషన్‌ నందు రెండు నెలల క్రితం పిర్యాదు చేసిన ఇప్పటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. ధరణిలో టీ ఏం 33 అప్లికేషన్‌ లు రంగారెడ్డి జిల్లాలోనే లక్షల కొద్దీ పెండిరగ్‌ లో వున్నా.. ఈ రెండు అప్లికేషన్‌ లు అప్రూవల్‌ కావడంపై మాడ్గుల మండలం లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.. అదే విధంగా గతంలో మాడుగుల తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌ గా పని చేసిన శ్రీను, మందుముల వెంకట రామారావు ఇద్దరు స్నేహబంధంతోనే ఇది సాధ్యం అయ్యిందనట్లు తెలుస్తుంది. . పలుమార్లు అరుబయట కలిసి సంప్రదింపులతో పాటు.. ప్రతి రోజు ఫోన్‌ లో మాట్లాడుకుంటారని సమాచారం. బదిలీపై శ్రీను కలెక్టర్‌ కార్యాలయంలో ధరణి డి సెక్షన్‌ హెల్ప్‌ డెస్క్‌ లో పని చేస్తున్నాడు. అతనితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అప్రూవల్‌ చేయించుకున్నారని మండలంలో ప్రచారం కొనసాగుతుంది.

అరవై సంవత్సరాల నుండి పట్టాదారు పాసుబుక్‌ లు లేని వ్యక్తులకు 2021 సంవత్సరంలో ఓ ఆర్‌ సి రాగా ఇంఫ్లూమెంట్‌ కోసం మీసేవలో మందుముల కుటుంబానికి సంబంధం లేని వారితో కలిసి సుమారు 67 అప్లికేషన్‌ లు పాసుబుక్‌ లు మంజూరు చేయాలనీ కలెక్టర్‌ కి అర్జీ పెట్టుకున్నారు. వాటిలో నుండి రెండు అప్లికేషన్‌ లు మండల రిపోర్ట్‌ లేకుండా అప్రూవల్‌ అవడం పలు అనుమానాలకు తెరలేపింది. కలెక్టర్‌ కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగికి వేతనం సుమారు రూ.12 వేలు మాత్రమే. అలాంటి ధరణి ఆపరేటర్‌ అయిన ఎం. క్రాంతి కుమార్‌ కలెక్టర్‌తో కుమ్మకై కోట్ల రూపాయల ఆస్తులు ఏవిధంగా కూడబెట్టాడో, మరో ధరణి ఆపరేటర్‌ సంతోష్‌ చారి అవినీతి వ్యవహారంపై పూర్తి ఆధారాలతో మీ ముందుకు మరో కథనం ద్వారా తీసుకురానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు