Saturday, May 4, 2024

కాంగ్రెస్‌ కురవృద్ధుడు నర్సారెడ్డి కన్నుమూత

తప్పక చదవండి
  • నర్సారెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు
  • సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్‌ తదితరులు
  • నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర
  • నిర్మల్‌ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా..
  • ఎమ్మెల్సీ, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ బాధ్యతలు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి (92) సోమవారం ఉద యం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం, వృ ద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా, నిర్మల్‌ జిల్లాలోని మలక్‌ చించోలి గ్రామానికి చెందిన నర్సారెడ్డి కాంగ్రెస్‌లో అంచెలచెంలుగా ఎదిగి.. 1972 నుంచి రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా పని చేశారు. జలగం వెంగళరావు కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగాను నర్సారెడ్డి పని చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో నర్సారెడ్డి పని చేశారు. కాగా, నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, నేతలు కూడా నర్సారెడ్డికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి అని నేతలు కొనియాడారు. నర్సారెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలియ జేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఆయన అనేక సేవలందించారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షు లుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకంగా ఉండేవని చెప్పుకొ చ్చారు. ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనిషి, నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మాజీ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. నర్సారెడ్డి మృతి పట్ల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంతాపం తెలిపారు. నిజాయితీగా రాజకీయాలు చేసి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని జీవితాంతం నమ్ముకున్న సిద్దాంతం కోసం పని చేసిన మాజీ పీసీసీ అధ్యక్షులు పి.నర్సారెడ్డి మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటన్నారు.
ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్‌ వాదిగా, సుపరిపాలనాదక్షుడిగా అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటితరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించిన నర్సారెడ్డి మృతి రాష్టాన్రికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు పొద్దుటూరి నర్సారెడ్డి మృతిపై ఉమ్మడి జిల్లాలోని అన్ని పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులుగా నర్సారెడ్డి విశేష సేవలు అందించారని కొనియాడారు. నర్సారెడ్డి మృతితో స్వగ్రామం సారంగాపూర్‌ మండలం మలక్‌చించోలిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చేసిన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. నర్సారెడ్డి మృతిపై మాజీ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల, రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన సమర్థవంతంగా పని చేశారని ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు…

- Advertisement -

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు