Tuesday, April 30, 2024

అసైనీ ల్యాండ్స్‌లో రూ.150 కోట్ల స్కాం

తప్పక చదవండి
  • సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, మొయినాబాద్‌ తహశీల్దార్‌

హైదరాబాద్‌ : అసైనీ భూములంటేనే అత్యంత పేదలకు కేటాయించబడ్డవి. కాయ కష్టం చేసుకొని కల్గిన కాడికి కలో గంజో తాగి బతికే బతుకు జీవులకు గత కాంగ్రెస్‌ సర్కార్ల జామనాలో ఇచ్చిన ల్యాండ్స్‌. దివంగత ప్రధాని ఇందిరమ్మ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల హయాంలో ఇచ్చిన ఈ భూములను నమ్ముకొని.. చాన్నాళ్లుగా వారి కుటుంబాలను సాదుకుంటున్నారు. ఆ భూములే వారికి ఆయువు పట్టువయ్యాయి. వారి కుటుంబాలకు ఆధారమయ్యాయి. కానీ, ఇప్పుడు పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు.. రియల్‌ గద్దల ఘన కార్యాల వల్ల హైదరాబాద్‌ చుట్టూ ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని అసైనీలకు పెను శాపంగా మారింది. మెయినాబాద్‌ మండలం తోల్‌కట్ట గ్రామంలోని అసైనీ భూములపై కన్నేసిన కొన్ని రియల్‌ రాబంధులు ఇప్పుడు వారిని నయానో.. భయానో దారికి తెచ్చుకొని అగ్రిమెంట్లు చేసుకొని అగ్గువకు ల్యాండ్స్‌ కొట్టేస్తుండడం గమనార్హం.
అయితే ఇలాంటి తంతులకు మంగళం పాడాల్సిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, మొయినాబాద్‌ తహశీల్దార్‌ రియల్‌ గద్దలు వెదజల్లిన చిల్లరకు ఆశపడి మొత్తం యవ్వారానికి రెండు చేతుల సహకరించడం విశేషం. అయిత్ఱే ఈ విషయం కాస్తా ఇప్పుడు ఆదాబ్‌ దృష్టికి రావడంతో దానిపై ఆదాబ్‌ నజర్‌ పెట్టడడంతో అవినీతి అధికారుల లీలలు, రియల్‌ గద్దల అసలు రంగు మొత్తం బయటకొస్తోంది. ఈ రియల్‌ గద్దలు.. ఆ అవినీతి అధికారులు చేస్తున్న రియల్‌ దందా మొత్తం తక్కువలో తక్కువ రూ.150 కోట్లని తేలింది. మొత్తం యవ్వారంపై త్వరలో ఆదాబ్‌లో వరుస కథనాలు ప్రచురించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు