Tuesday, April 30, 2024

క్యాన్సర్‌ రోగుల పాలిట కసాయి హృదయం..

తప్పక చదవండి
  • మహిళా రూపంలో మహమ్మారి..
  • ఎంఎన్‌జే ఇంచార్జ్‌ జయలత చేస్తున్న నిర్వాకం..
  • అర్హత లేకఫొయినా అందలం..
  • సీనియర్‌ ఆనకాలగిస్ట్‌ లను వెనక్కి నెట్టిన దుర్మార్గం..
  • 2022 డిసెంబర్‌ లో అడిషనల్‌ డీ ఎం ఈ గా ప్రమోషన్‌..
  • ఇష్టానుసారం మిషనరీల కొనుగోలు..
  • ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ..
  • ఎన్‌. జయలత అక్రమ లీలలు అన్నీ ఇన్నీ కావు..
  • ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించాలంటున్న రోగులు

క్యాన్సర్‌ రోగులు ఎంతో దురద్రుష్టవంతులు ఇది ఒకప్పటి మాట.. ఇప్పుదు వైద్య రంగంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. ఎలాంటి క్యాన్సర్‌ వ్యాధిని అయినా సమూలంగా తుడిచిపెట్టగల వైద్యశాస్త్రం ఆవిషృతం అయ్యింది.. కానీ కొంతమంది వైద్యులు అవినీతి రోగంతో అసలు రోగులపాలిట ప్రమాదకరంగా పరిణమించారు.. అలాంటి కోవలోకే వస్తారు ఎంఎన్‌జే డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. జయలత.

హైదరాబాద్‌ : ఎంఎన్‌జే ప్రస్తుత ఇంచార్జ్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ ఎన్‌. జయలత ప్రొఫెసర్‌ ఇన్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ రేడియాలజీ అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2వ తేది, జూన్‌ 2015లో, ఇంచార్జి డైరెక్టర్‌, పుట్ట శ్రీనివాస్‌ రిటైర్‌ ఆయన తరువాత చాలామంది సీనియర్‌ ఆంకాలజీస్ట్‌ లు ఉన్న, కాదని ఇంచార్జ్‌ డైరెక్టర్‌ గా జయలతను నియమించారు.
అప్పటినుండి ఇంచార్జ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న జయలత 2022 డిసెంబర్‌ లో అడిషనల్‌ డీఎంఈగా ప్రమోషన్‌ పొంది, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, సూర్యాపేటలో ప్రిన్సిపాల్‌గా పోస్ట్‌ అయ్యారు.. కానీ ఈమె తన పరపతిని ఉపయోగించి, మళ్ళీ ఎంఎన్‌జే ఇంచార్జి డైరెక్టర్‌గా ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఈమె తన శాలరీని 30-12-2022 లో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో డ్రా చేస్తున్నప్పటికి, తొమ్మిది సంవత్సరాలుగా ఎంఎన్‌జే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. దీనికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం గమనార్హం..
ప్రతి స్పెషాలిటీ హాస్పిటల్‌కి, ఆ స్పెషలిటీకి సంబంధించిన డాక్టర్‌ ఉండటం ఆనవాయితీ.. ఉదాహరణకి చెస్ట్‌ హాస్పిటల్‌కి పల్మోనాలజిస్ట్‌ స్పెషలిస్ట్‌, ఈఎన్‌టి హాస్పిటల్‌కి ఈఎన్‌టి స్పెషలిస్ట్‌, ప్రసూతి ఆసుపత్రికి గైనకాలజిస్ట్‌, కంటి ఆసుపత్రికి ఆప్తమాలజిస్ట్‌ ఉండటం, హాస్పిటల్‌ యొక్క ఎదుగుదలకు, అలాగే స్టాఫ్‌ కి కూడా మంచిది. అన్ని ఆస్పత్రుల్లో అలాగే కొనసాగుతోంది.. కానీ ఎంఎన్‌జేలో మాత్రం దీనికి విరుద్దంగా ఒక రేడియాలజిస్ట్‌ మాత్రమే అయివుండి ఎంతో మంది ఆంకాలజీస్ట్‌ ఉండగా కూడా ఈమెనే విధుల్లో కొనసాగిస్తున్నారు. ఈమె ఒక రేడియోలజిస్ట్‌ అని, ఈమె మూలంగా హాపిటల్‌ లో అభివృద్ధి కుంటుపడుతోందని, యూజర్‌ చార్జెస్‌ గురించి అప్పటి హెల్త్‌ మినిస్టర్‌ అయిన లక్ష్మారెడ్డికి ఈటల రాజేందర్‌కి, హరీష్‌ రావుకి, హెల్త్‌ సెక్రెటరీకి ఎన్ని సార్లు స్టాఫ్‌, ఫాకల్టీ ఫిర్యాదులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు..
గత తొమ్మిది సంవత్సరాలుగా ఇంచార్జ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతూ, ఏక పక్షంగా అనేక మిషనిరీలు కొనుగోలు చేసింది.. క్యాన్సర్‌ హాస్పిటల్‌ లో కొన్న ప్రతి మిషన్‌, క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడేలా ఉండాలి.. కానీ ఈమె క్యాన్సర్‌ స్పెషలిటీకి సంబంధించిన వాళ్ళతో సంప్రదించకుండా కొనుగోలు చేసింది..
ఎంఆర్‌ఐ మిషన్‌ కొన్నప్పటికీ, అది ఆధునిక క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌కు ఉపయోగపడకుండా కేవలం నిర్ధారణ వరకే పరిమితం అయ్యింది.. అలాగే రూ. 20 కోట్ల పెట్‌ స్కాన్‌ మిషన్‌కి సంబంధించి కూడా ఎవరినీ సంప్రదించకుండా, నిమ్స్‌ ఆర్డర్‌ ని కాపీ పేస్ట్‌ చేసి కొనుగోలు చేసి, దానిని కూడా ఆధునిక క్యాన్సర్‌ చికిత్సకు పనికిరాకుండా చేశారు.. ఇలా ఆధునిక క్యాన్సర్‌కి అవసరమైన పరికరాలు కాకుండా, తన ఇష్టానుసారంగా, పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించకుండా వృధా చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్‌ పైన గత ప్రభుత్వంలోని నాయకుల అండతో అనేక అవినీతి కార్యక్రమాలకు తెరలేపారని ఆధారాలతో సహా వార్తకథనాలు విడుదలయ్యాయి. అయినప్పటికి సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్రలో ఉండటం అత్యంత శోచనీయం.
కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దీనిమీద సమగ్ర విచారణ జరిపి, క్యాన్సర్‌ హాస్పిటల్‌ ను అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్‌ రోగులకు సరిjైున, ఆధునికమైన చికిత్స అందించేలా చూడాలని.. సర్జరీ, మెడికల్‌, రేడియేషన్‌ ఆంకాలజి లాంటి సంపూర్ణ హంగులు కలిగిన ఏకైక క్యాన్సర్‌ ఆసుపత్రికి అర్హులైన, సీనియర్‌ ఆంకాలజిస్ట్‌ని డైరెక్టర్‌గా నియమించి, అవినీతికి పాల్పడిన డైరెక్టర్‌ జయలతపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు