- భూకబ్జాలు, కమీషన్ల దందాతో వేల కోట్లు దండుకున్న గంగుల
- డిసెంబర్ 3న కేసీఆర్ ‘పవర్’ కట్ కాబోతోంది
- 4నుండి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రే !
- కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్
- చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్
కరీంనగర్ : రైతులు పండిరచిన ధాన్యం అమ్మితే కోత పెట్టి కమీషన్లు తింటున్న రైతు రాబంధు గంగుల కమలాకర్. ప్రభుత్వం కొన్న వడ్లు, బియ్యం టెండర్లలో ఈ ఒక్క ఏడాది రూ.1300 కోట్లు గోల్ మాల్ చేసి తెలంగాణను ముంచిన అవినీతి పరుడు గంగుల. భూకబ్జాలు, గ్రానైట్ గుట్టలను మాయం చేసి కమీషన్లు దండుకున్న గంగుల నాపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ విమర్శించారు. కరీంనగర్ నియోజక వర్గంలోని చింతకుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఎవరు అవినీతిపరుడు. దేశంలోనే మహాచోర్ కేసీఆర్… రాష్ట్రంలోనే బడా చోర్ గంగుల. గూగుల్లో వెతికినా.. చాట్ జీపీటీని అడిగినా.. కేసీఆర్, గంగుల పేర్లే ఉంటాయి.ప్రజల సొమ్మును, గ్రానైట్ గుట్టలు, ఇసుకను.. ఎక్కడపడితే అక్కడ మెక్కిందెవరు..? రైతులు పండిరచిన ధాన్యం మీద కమీషన్లు తీసుకున్న కక్కుర్తి లీడర్లు ఎవరు… రైతులు పండిరచిన ధాన్యం అమ్మితే కోత పెట్టి కమీషన్లు తింటున్న రైతు రాబంధులు ఎవరు..? ప్రభుత్వం కొన్న ధాన్యం.. బియ్యం అమ్ముట్ల టెండర్లలో గోల్మాల్ చేసిందెవరు.. ఈ ఒక్క ఏడాది రూ.1300 కోట్లు టెండర్లలో గోల్మాల్ చేసి తెలంగాణను ముంచింది ఎవరు..? అందులో నీ వాటా ఎంత..? కేసీఆర్కు ముట్టజెప్పింది ఎంత..? గంగుల నీ భండారం.. తవ్విన కొద్దీ గ్రానైట్ గుట్టల్లెక్క బయటపడుతుందన్నారు.