Saturday, December 2, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రాజకీయ నాయకులను
నేనేమి చేయగలను,
నేనెట్లా ప్రశ్నించగలను
అని ఆలోచించే సామాన్యుడికి
ఓటే ఆయుధం..
రాజకీయ నాయకుల మీద,
ప్రజలను దగా చేస్తున్న
పార్టీల మీద నీకున్న కసిని
ఓటు రూపంతో తీర్చుకో…
నిరుద్యోగులైన, మేధావులైన,
విద్యార్థులైన, మీ ఆలోచనకు
పదును పెట్టి సరియైన
నాయకున్ని ఎన్నుకో..
ఐదు సంవత్సరాలు
మీ తలరాతను రాజకీయ
నాయకుల్లో చేతిలో పెట్టబోతున్నారు…
ఒకటికి రెండుసార్లు ఆలోచించి
మీ ఓటు అనే ఆయుధాన్ని
సద్వినియోగం చేసుకోండి..
నాకెందుకులే అని ఆదమరిచారో
మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తో పాటు
రాష్ట్ర గతి అధోగతి పాలు అవుతుంది…
సో బీ కేర్‌ ఫుల్‌ ప్రజలారా..

               - కుమ్మరి రాజు 
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు