Wednesday, May 15, 2024

ఓటర్‌ స్లిప్పుల పంపిణీలో వేగం పెంచాలి

తప్పక చదవండి
  • అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వారికి పూర్తి స్థాయి వసతుల కల్పన
  • జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌

సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 22 నాటికి ఇంటింటా ఓటర్‌ స్లిప్పులు పంపిణీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆదివారం నాలుగు నియోజక వర్గాల ఆర్‌.ఓ లు,ఏఆర్‌ఒలతో పాటు అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. ప్రియాంక, ఏ. వెంకట్‌ రెడ్డిలతో వెబెక్స్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని నియోజక వర్గాలలో ఓటర్‌ స్లిప్పులు పంపిణీ ప్రక్రియ మరింత వేగం పెంచి వచ్చే 22 తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పోలింగ్‌ రోజున వికలాంగులు, అంధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సూచించినా నిర్దిష్టమైన ప్రణాళికతో అన్ని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతులు ఉండాలని సూచించారు. ముక్యంగా అంధులు, ముగా, చెవిటి వారికి ఇప్పటికే ఓటింగ్‌ పై అన్ని నియోజక వర్గాలలో మాస్టర్‌ ట్రైనర్స్‌ తో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని తెలిపారు. అన్ని నియోజక వర్గాలలో 16739 మంది వికలాంగులు,అలాగే అంధులు 2113 మంది, చెవిటి మూగ వారు 1814 మంది ఉన్నారని ఇప్పటికే 1201 పోలింగ్‌ కేంద్రాలలో 728 వీల్‌ ఛైర్స్‌ అందుబాటులో ఉంచాని, అలాగే వీరికి సేవాలందించుటకు వాలంటిరీలను అలాగే ఆటోలను సమకూర్చడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ల సెల్‌ నెంబర్లు ఆయా నియోజక వర్గాలలో అందరి అందుబాటులో ఉండాలని , ఎక్కడకూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిర్దేశించిన విదంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఈ సందర్బంగా సూచించారు.ఈ వెబెక్స్‌లో డి.డబ్యు.ఓ జ్యోతి పద్మ, తహశీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు