Friday, May 3, 2024

ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి 12 నెలల జైలు శిక్ష

తప్పక చదవండి
  • 2వేల రూపాయల జరిమానా : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి

వికారాబాద్‌ : ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తికి కోర్టు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ, 2 వేల రూపాయల జరిమానా విధించింది.జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…నవాబుపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018 సంవత్స రం లో నిందితుడు కుంటి రాజు(30) తండ్రి మల్లయ్య బాధితురాలిని ప్రేమ పేరుతో వేదిస్తూ, ప్రేమించక పోతే చంపేస్తా అని బెదిరించి, చేయి పట్టి గుంజులాడినాడు అని బాధితురాలు పిర్యాదు ఇవ్వగా నవాబుపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ నందు అప్పటి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కే. కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.దర్యాప్తు అనంతరం ఛార్జ్‌ షీట్‌ ను మేజిస్ట్రేట్‌ ముందు కోర్ట్‌ లో సమర్పించగా, వాదోపవాదనలు విన్న జే.ఎఫ్‌.సి. ఎం వికారాబాద్‌ జడ్జి శ్రీకాంత్‌ నిందితుడైన కుంటి రాజు కి 12 నెలల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందనీ ఎస్పీ ప్రకటన ద్వారా తెలిపారు. ఇట్టి కేసులో పని చేసిన ఏపిపి సమీనా బేగం, ఐఓ కృష్ణయ్య(ఇంతక ముందు ఎస్సై)ని, బ్రీఫింగ్‌ అధికారి (ప్రస్తుత ఎస్సై) భరత్‌ భూషణ్‌ ని, సీడీ ఓ నగేష్‌ ని జిల్లా ఎస్పీ అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు